బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను రాయడం వల్ల చేతులు, పాదాలకు కావాల్సిన తేమ లభిస్తుంది. చేతులు, పాదాలు మృదువుగా మారుతాయి.
రెండు స్పూన్ల చక్కెరలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె కలిపి చేతులు, పాదాల దగ్గర సున్నితంగా స్క్రబ్ చేయండి. దీంతో మృతకణాలు తొలగుతాయి. చర్మం మృదువుగా మారుతుంది.
రాత్రి పడుకునే సమయంలో చేతులకు, పాదాలకు పెట్రోలియం జెల్లీ రాయండి. తర్వాత చేతులకు గ్లౌజ్‌లు, పాదాలకు సాక్స్‌లు ధరించండి. దీంతో పాదాలు, చేతులు మృదువుగా మారుతాయి.
ఒక బకెట్లో కొద్దిగా గోరువెచ్చని నీరు తీసుకొని అందులో ఎప్సమ్ సాల్ట్ వేయండి. ఈ నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల పాదాలు మృదువుగా మారుతాయి.
కలబంద జెల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. స్వచ్ఛమైన కలబంద జెల్‌ను నేరుగా పాదాలు, చేతులకు రాయడం వల్ల అవి మృదువుగా మారుతాయి.
ఓట్స్‌లో చర్మాన్ని తేమగా మార్చే సహజ ప్రోటీన్లు ఉంటాయి. దీన్ని తేనెతో కలిపి పాదాలకు, చేతులకు రాయడం వల్ల పాదాలు మృదువుగా మారుతాయి.
బాగా పండిన అరటిపండులో కొద్దిగా తేనె కలిపి చేతులు, పాదాలకు రాయండి. వీటిలోని పోషకాలు చర్మాన్ని మృదువుగా మార్చుతాయి.
చేతులు, పాదాలను శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాయండి. దీంతో చేతులు, పాదాలు పగలడం, పొడిగా మారడం వంటి సమస్యలు ఉండవు.
నీరు పుష్కలంగా తాగడం వల్ల చర్మం లోపల నుంచి హైడ్రేట్‌గా ఉంటుంది. పాదాల పగుళ్లు తగ్గుతాయి. చేతులు, పాదాలు మృదువుగా మారుతాయి.