
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చాలాచోట్ల సరిగా జరగడం లేదు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ఈనెల 27వ తేదీ నాటికి 82 శాతం పూర్తయినట్లు అధికార యంత్రాంగం చెబుతోంది.
కాని క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. నగరాల్లోని అపార్టుమెంట్లలో చాలామంది తమకు ఫారాలు అందలేదంటున్నారు. కొన్ని ప్రాంతాలకైతే బీఎల్వోలు, బీఎల్ఏలు రాలేదంటున్నారు. మరికొన్నిచోట్ల ఇంటింటికీ వెళ్లకుండా సచివాలయాలు, కమ్యునిటీ భవనాల వద్ద కూర్చొని మమ అనిపిస్తున్నారు. మరిన్ని వివరాలు.. మా ఇంటికి ఎప్పుడొస్తారు ‘సర్’ |