
బెంగళూరుకు చెందిన ఒక ఆటో డ్రైవర్ 'చాట్‌జీపీటీ'పై కనబరిచిన అవగాహన ఇప్పుడు ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సమస్యలు పరిష్కరించుకోవడానికి, చివరకు కన్నడలో సంభాషణలు జరపడానికి...
బెంగళూరుకు చెందిన ఒక ఆటో డ్రైవర్ 'చాట్‌జీపీటీ'పై కనబరిచిన అవగాహన ఇప్పుడు ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సమస్యలు పరిష్కరించుకోవడానికి, చివరకు కన్నడలో సంభాషణలు జరపడానికి కూడా తాను చాట్‌జీపీటీని ఎలా వినియోగిస్తున్నాడో ఆయన వివరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈయనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.గగన్ సాయిప్రసాద్ అనే కంటెంట్ క్రియేటర్ తన ఆటోలో ప్రయాణిస్తుండగా డ్రైవర్‌తో మాటలు కలిపారు. ఈ సంభాషణలో భాగంగా చాట్‌జీపీటీ ప్రస్తావన రాగా, ఆ డ్రైవర్ దానిపై తనకున్న పట్టును ప్రదర్శించారు. తనకు ఏదైనా సందేహం వచ్చినా, ఒక కొత్త విషయం గురించి తెలుసుకోవాలనుకున్నా వెంటనే చాట్‌జీపీటీని ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు. తాను సాధారణంగా ప్రశ్నలను ఇంగ్లీషులో టైప్ చేసి, సమాధానాలను మాత్రం కన్నడలో చెప్పమని కోరతానని, దీనివల్ల క్లిష్టమైన అంశాలు కూడా సులభంగా అర్థమవుతాయని వివరించారు. కొన్ని నెలల క్రితం అడిగిన ప్రశ్నలకు కూడా ప్రస్తుత ప్రశ్నలతో సంబంధం జోడించి సమాధానాలు ఇవ్వగల చాట్‌జీపీటీ సామర్థ్యం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన అన్నారు.సంభాషణ మధ్యలో చాట్‌జీపీటీకి వాయిస్ ఫీచర్ కూడా ఉందని తెలుసుకున్న ఆ డ్రైవర్, వెంటనే దాన్ని ప్రయత్నించి మరింత ఆశ్చర్యపోయారు. చాట్‌జీపీటీ కేవలం కన్నడలో సమాధానాలు టైప్ చేయడమే కాకుండా, వాటిని స్పష్టంగా మాట్లాడటం చూసి ఆయన ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ వీడియో చూసిన వారంతా ఆయన ఉత్సాహానికి ఫిదా అయ్యారు.అయితే, ఆయన కేవలం చాట్‌జీపీటీని పొగడటమే కాకుండా, దాని పరిమితులపై కూడా ఒక విశ్లేషణ చేశారు.