
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి తెలిసిందే. ఇటీవల ఆయన సోదరి శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సోదరుడి గురించి అనేక గుర్తుండిపోయే విషయాలను పంచుకున్నారు.
ఉదయ్ కిరణ్ ఎంతటి భావోద్వేగమైన, సున్నితమైన వ్యక్తిత్వం కలవాడో ఆమె వెల్లడించారు. మనసంతా నువ్వే సినిమా రీ-రిలీజ్ నేపథ్యంలో, ఉదయ్ కిరణ్ అభిమానులు, కుటుంబ సభ్యులు అతని జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి మాటల్లో, ఉదయ్ కిరణ్ చాలా ఎమోషనల్ పర్సన్. తనకు బాధగా ఉన్నప్పుడు సాగర సంగమం సినిమా పెట్టుకుని ఏడ్చేవాడని తెలిపారు. తన అక్కగా, తాను చెప్పని ఎన్నో విషయాలను ఆమెతో పంచుకునేవాడని. వారిద్దరి మధ్య ఎప్పుడూ దూరం రాలేదు, గొడవలు పడలేదని చెప్పుకొచ్చారు.. అప్పుడప్పుడు "అక్కా, నేను నీతో మాట్లాడను" అన్నా, రెండు నిమిషాల్లోనే మళ్లీ పలకరించేవాడని శ్రీదేవి గుర్తుచేసుకున్నారు. తన పిల్లలంటే ఉదయ్ కిరణ్‌కు ఎంతో ప్రాణం. ముఖ్యంగా తన కూతురి విషయంలో అతను చాలా పొసెసివ్‌గా ఉండేవాడని అన్నారు. "ఎందుకు ఇప్పుడే ఎక్స్పోజ్ చేస్తావు?" అని ప్రశ్నిస్తూ, చిన్న ఐప్యాడ్ కూడా కొనేవాడు కాదట. తన మేనల్లుడిని "This is my boy. I am going to bring him up in my style" అని ఎత్తుకున్నప్పుడు, అతనిలో మేనమామ ప్రేమ స్పష్టంగా కనిపించేదని శ్రీదేవి తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‌తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..
ఒత్తిడిలో ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ చేసే పని డ్రైవ్‌కు వెళ్లడం. ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని, ఎలాంటి మాటలు లేకుండా కేవలం మ్యూజిక్ వింటూ ప్రయాణించేవాడట. అది అతను ఒత్తిడిలో ఉన్నాడని ఆమెకు చెప్పకనే చెప్పే సంకేతమని వివరించారు. అభిమానుల పట్ల ఉదయ్ కిరణ్ చాలా గౌరవంగా ఉండేవారు. ఒక అమ్మాయి రక్తం అడ్డంకి లేఖ రాస్తే అతను చాలా కోపంగా, "ఇది జీవితం, రక్తాన్ని అగౌరవపరచడం" అని అన్న సంఘటనను వివరించారు. అలాగే, తిరుపతిలో ఒక అభిమాని ఫోటో, ఆటోగ్రాఫ్ అడిగితే, "బాస్, మనం దేవుడి దగ్గర ఉన్నాము. ఆయన ఇప్పుడు అందరికంటే పెద్ద ఇక్కడ. మనమంతా ఒకటే ఆయన ముందు. బయట కలుద్దాం, అన్నీ చేస్తాను" అని ఎంతో స్వీట్‌గా, ఓపికగా చెప్పాడని శ్రీదేవి గుర్తు చేసుకున్నారు.
ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‌లాగే ఉందిగా..
ఉదయ్ కిరణ్ స్వభావం ఎప్పటికీ ఒకేలా ఉండేది. నటుడిగా ఎదిగిన తర్వాత కూడా ఎప్పుడూ డౌన్ టు ఎర్త్‌గా ఉంటూ, ఎక్కడ కనిపించినా కారు దిగి పలకరించేవాడని తెలిపారు. ప్రస్తుత తరం హీరోలలో నాని, విజయ్ దేవరకొండలలో ఉదయ్ కిరణ్ లక్షణాలు కనిపిస్తాయని శ్రీదేవి అన్నారు. ముఖ్యంగా నానితో ఉదయ్ చాలా సన్నిహితంగా ఉండేవాడని, నాని తన పెళ్ళిలో కూడా వచ్చాడని, ఉదయ్ కిరణ్ మరణం తర్వాత తమ ఇంటికి వచ్చి పలకరించాడని ఆమె ఎమోషనల్ అయ్యారు. నాని, తరుణ్, ఎన్టీఆర్, అల్లరి నరేష్ వంటివారితో ఉదయ్ కిరణ్ మంచి స్నేహితులు అని, జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి లంచ్‌కు వెళ్లిన విషయాలను కూడా ఉదయ్ కిరణ్ తమతో పంచుకునేవాడని శ్రీదేవి పేర్కొన్నారు.
[caption id="attachment_1853424" align="alignnone" width="1280"] Uday Kiran, Nani[/caption] ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష.. వీడియోస్ ఇదిగో..