
ఇంటర్నెట్‌డెస్క్: యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) చివరిమెట్టుపై తడబడ్డాడు. ఫైనల్లో చైనీస్ తైపీ క్రీడాకారుడు సు లియాంగ్ చేతిలో ఓడి..
రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం గంటకుపైగా హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. ఈ 33 ఏళ్ల షట్లర్ తొలిగేమ్‌లో ఓడినప్పటికీ.. తర్వాత పుంజుకున్నాడు. కానీ, వయసులో తనకన్నా 9 ఏళ్ల చిన్నవాడైన లియాంగ్ వేగాన్ని అందుకోవడంలో వెనకబడ్డాడు. ఈ సీజన్లో మొదటి ఫైనల్ ఆడిన మాజీ నెంబర్ వన్.. తొలుత ఆటను వేగంగానే ప్రారంభించాడు. తర్వాత లయ తప్పడంతో అనవసర తప్పిదాలు దెబ్బతీశాయి.
ఈ పోరులో శ్రీకాంత్ చివరకు 15-21, 21-16, 9-21 తేడాతో ఓడిపోయాడు (US Open badminton tournament). గతేడాది మలేసియా మాస్టర్స్ సూపర్ 500, సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300లో కూడా రెండోస్థానంతోనే సరిపెట్టుకున్నాడు. 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్ రజతపతకాన్ని గెల్చుకున్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.