
భారీ భూకంపంతో శ్మశానాన్ని తలపిస్తున్న వెనిజువెలాలో అద్భుతం జరిగింది. మృత్యువుతో పోరాడి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో తిరిగి వచ్చారు. భూకంపం సంభవించి భవనాలు కుప్పకూలిపోయిన నాలుగు రోజుల తర్వాత..
అంటే దాదాపు 96 గంటల పాటు కాంక్రీట్ శిథిలాల కింద నరకం చూసిన తండ్రీకొడుకులను రెస్క్యూ సిబ్బంది ఆదివారం సజీవంగా వెలికితీశారు. వెనిజువెలా భూకంప విషాదంలో ఈ ఘటన ఒక పెద్ద వెలుగురేఖగా నిలిచింది.తీరప్రాంత రాష్ట్రమైన లా గుయ్రాలో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. బుధవారం సంభవించిన భయంకరమైన భూకంపం ధాటికి ఇక్కడి వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. కూలిపోయిన ఒక భవనం శిథిలాల కింద తండ్రీకొడుకులు చిక్కుకుపోయారు. ఫ్రాన్స్, అమెరికా దేశాలకు చెందిన అంతర్జాతీయ సెర్చ్, రెస్క్యూ బృందాలు అత్యాధునిక కెమెరాలు, లైఫ్ డిటెక్టర్ పరికరాల సాయంతో కాంక్రీట్ దిబ్బల కింద జీవకళ ఉన్నట్లు గుర్తించాయి. శకలాలను తొలగిస్తూనే లోపలికి ఐవీ ఫ్లూయిడ్స్ (సెలైన్ ద్రవాలు) పంపుతూ.. సుమారు 12 గంటల పాటు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించి వారిని సురక్షితంగా బయటకు తెచ్చారు. తీవ్రమైన అలసట, డీహైడ్రేషన్‌తో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.వెనిజువెలాలో బుధవారం సంభవించిన భూకంపం సృష్టించిన బీభత్సానికి ఇప్పటివరకు 1,450 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. సుమారు 50 వేల మంది ఈ విపత్తు వల్ల రోడ్డున పడ్డారు. శని, ఆదివారాల్లో రెస్క్యూ టీమ్స్ మొత్తం 33 మందిని ప్రాణాలతో కాపాడాయి. సాధారణంగా ఇలాంటి విపత్తుల్లో 72 గంటల తర్వాత