
టాలీవుడ్లో 17 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డుకు సమంత బ్రేక్ వేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’..
అనుష్క నటించిన ‘అరుంధతి’ కలెక్షన్లను దాటేసి తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రధాన చిత్రంగా నిలిచింది.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. విడుదలైన పదో రోజు ఈ చిత్రం భారత్‌లో రూ.5.30 కోట్ల నెట్ వసూలు చేసింది. దీంతో దేశీయ నెట్ కలెక్షన్లు రూ.48.25 కోట్లకు చేరాయి. గ్రాస్ వసూళ్లు రూ.55.86 కోట్లుగా నమోదయ్యాయి. విదేశాల్లో మరో రూ.22.85 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు రూ.78.71 కోట్లకు చేరుకున్నాయి.2009లో విడుదలైన ‘అరుంధతి’ ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్‌తో మహిళా ప్రధాన చిత్రాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ ఆ రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించింది. 17 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ రికార్డును కేవలం 10 రోజుల్లోనే బద్దలు కొట్టడం విశేషం.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ‘మా ఇంటి బంగారం’ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. పదో రోజు ఈ రెండు రాష్ట్రాల్లోనే రూ.4.50 కోట్ల గ్రాస్ వసూలైంది. కర్ణాటక నుంచి రూ.1.10 కోట్లు, తమిళనాడు నుంచి రూ.41 లక్షలు వచ్చాయి.దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే నిర్మాణ వ్యయానికి నాలుగు రెట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం రూ.100 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ మార్క్‌వైపు వేగంగా దూసుకెళ్తోంది.