
Horoscope Today 29 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున జ్యేష్ఠ పౌర్ణమి వేళ చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది.
ఇదే రోజున సిద్ధి, శుక్ర, బ్రహ్మ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి వారికి ఈరోజు ఆప్తుల నుంచి అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. పాత అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లాభదాయకం. సంఘంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
వృషభ రాశి వారు ఈరోజు చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. కొన్ని పనులు ఆత్మ విశ్వాసంతో చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.
మిథున రాశి వారికి ఈరోజు రుణ ఒత్తిడి అధికమవుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయంలో ఊహించని విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు అతి కష్టం మీద పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.
కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి. ఇంటా బయటా ఒత్తిడి వల్ల మానసిక సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో సహోద్యోగులతో సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
సింహ రాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహారిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహన యోగం ఉంది. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
తుల రాశి వారికి ఈరోజు ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృశ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసివస్తాయి.
ధనుస్సు రాశి వారు ఈరోజు కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. సోదరుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
మకర రాశి వారికి ఈరోజు చేయని పనికి నిందలు మోయాల్సి వస్తుంది. అనవసర వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి.
కుంభ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభదాయకం.
మీన రాశి వారికి ఈరోజు ప్రయాణాలలో అవరోధాలు తప్పవు. డబ్బు వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. వృత్తి, ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయటా ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.