
Jagtial | జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. మల్యాల మండలం నూకపెల్లి గ్రామానికి నాగరాజు అనే వ్యక్తి తన భార్య లక్ష్మీని ఉరివేసి హత్య చేశాడు.
అనంతరం అతను కూడా అదే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దంపతుల మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.