
బాలేశ్వర్: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా రెమునా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ వివాహ విందులో మేక మాంసం వడ్డించలేదన్న కోపంతో కేటరింగ్ సిబ్బందిపై నలుగురు మైనర్లు పదునైన ఆయుధంతో దాడి చేశారు.
మాంసానికి బదులుగా చికెన్ వడ్డించడంతో కోపోద్రిక్తులైన బాలురు కేటరింగ్ సిబ్బందిలో ఒకరిని తీవ్రంగా గాయపరిచారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో కటక్‌లోని వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి, 16, 17 సంవత్సరాల నడుమ వయసున్న నిందితులు నలుగురినీ అంగుల్ జువైనల్ హోంకు తరలించినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.