
షడాష్టక యోగం వల్ల మేష రాశి వారికి వృత్తిపరమైన విజయాలు దక్కుతాయి. ఉద్యోగం వ్యాపారం చేసే చోట ఈ రాశి వారి ప్రత్యర్థులు ఓడిపోతారు. ఈ రాశి వారిలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు పెరుగుతాయి.
వీరి జీవితంలో ఆకస్మిక ఆర్థిక లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ విషయంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.
షడాష్టక యోగం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలను తెస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు బాగా వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మంచి పేరున్న వ్యక్తులతో సంబంధాలు పెరుగుతాయి. ఒక ముఖ్యమైన కోర్టు తీర్పు వారికి అనుకూలంగా రావచ్చు.
శుక్ర, శని గ్రహాల ఈ కలయిక కర్కాటక రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. జీవితం నుండి ప్రతికూలత తొలగిపోయి, సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి. వైవాహిక జీవితం, ప్రేమ సంబంధాలు మరింతగా బలపడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది.
శుక్ర, శని గ్రహాల ఈ కలయిక తులారాశి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశివారు మానసికంగా మరింత బలంగా మారుతారు. వ్యాపార ఒప్పందాలు వీరికి దక్కే అవకాశం లభించవచ్చు. వీరు విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది.