
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
2026 Bollywood 1st 6 Months Review: అవును 2026 ఇంగ్లీష్ కాలండర్లో ఆరు నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఈ ఆరు నెలల్లో వేళ్ల మీద లెక్క పెట్టే చిత్రాలు మాత్రమే విజయాలు నమోదు చేశాయి. ఇక హిందీలో జనవరి నెలలో దాదాపు అర డజనుకు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. అందులో సన్ని దేవోల్, వరుణ్ ధావన్ హీరోలుగా నటించిన ‘బార్డర్ 2’ సినిమా రిపబ్లిక్ డే కానుకగా విడుదలై మంచి ఓపెనింగ్స్ రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 90వ దశకంలో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘బార్డర్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. మొత్తంగా రూ. 464 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టి బాలీవుడ్‌కు మంచి శుభారంభం అందించింది.
చరిత్ర సృష్టించిన ‘దురంధర్ 2’.. ఇక జనవరి నెల చివర్లో విడుదలైన రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ సినిమా మంచి విజయం సాధించింది. అటు ఫిబ్రవరిలో ఉగాది కానుకగా విడుదలైన ‘దురంధర్ ది రివేంజ్’ మూవీ బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులు అన్నింటిని మడతపెట్టేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1855.44 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ముఖ్యంగా హిందీ నెట్ కలెక్షన్స్‌లో రూ.1100 నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. ఇప్పట్లో ఈ సినిమా రికార్డును బ్రేక్ చేయడం అంత ఈజీ వ్యవహారం కాదు.
ఇక ఏప్రిల్‌లో అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కాంబినేషన్లో వచ్చిన ‘భూత్ బంగ్లా’ మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక మే నెలలో రితేష్ దేశ్‌ముఖ్ హీరోగా నటించిన ‘రాజా శివాజీ’ సినిమా మంచి విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
జూన్ చివర్లో ‘వెల్కమ్ టూ ది జంగిల్’.. జూన్ చివరి వారంలో విడులైన అక్షయ్ కుమార్ భారీ మల్టీస్టారర్ కామెడీ మూవీ ‘ వెల్కమ్ టూ ది జంగిల్’ సినిమా మంచి వసూల్లతో దూసుకుపోతుంది. మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ. 100 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.
ఇక యేడాది ‘ఓ రోమియో’, ‘కాక్‌టెల్ 2, హే జవానీ హైతో ఇష్క్ హోనా హై’, మై వాపస్ ఆవూంగా’ చిత్రాలు యావరేజ్‌గా నిలిచాయి. ఇక ఆర్ఎస్ఎస్ చరిత్రపై తీసిన ‘శతక్ .. సంఘ్ కే 100 వర్ష్’, ది కేరళ స్టోరీ 2, ఏక్ దిన్, కృష్టావతార్ వంటి చిత్రాలు ఫ్లాప్స్‌గా మిగిలిపోయాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.