
PPF Investment Scheme: మీకు సురక్షితమైన పెట్టుబడి, హామీతో కూడిన ఆదాయం, పన్ను మినహాయింపు కావాలంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ (PPF) మీకు ఉత్తమమైన ఎంపిక.
ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందుతుంది. అలాగే మెచ్యూరిటీ సమయంలో అందే మొత్తం పన్ను రహితం. 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్, చక్రవడ్డీ ప్రయోజనంతో దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నిధిని నిర్మించుకోవడానికి పీపీఎఫ్ మీకు సహాయపడుతుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రమాదం లేకుండా పదవీ విరమణ పొదుపును నిర్మించుకోవడానికి ఇది ఒక నమ్మకమైన ఎంపిక. మీరు పోస్ట్ ఆఫీస్ లేదా గుర్తింపు పొందిన బ్యాంకులో సంవత్సరానికి కేవలం రూ. 500 పెట్టుబడితో పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈ రోజుల్లో చాలా ప్రజాదరణ పొందిన పథకం. ఈ పథకంలో సంవత్సరానికి రూ.25,000 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో మీకు ఎంత డబ్బు వస్తుందో చూద్దాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల తర్వాత దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ పథకం మెచ్యూరిటీ కాలాన్ని మరో 5 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ విషయంలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకంలో పెట్టుబడి పెట్టే వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందవచ్చు. ఒకవేళ ఎవరైనా ఒక సంవత్సరంలో పీపీఎప్లో రూ.25,000 పెట్టుబడి పెడితే వారు మెచ్యూరిటీ కాలంలో (అంటే 15 సంవత్సరాల తర్వాత) మొత్తం రూ. 6,78,035 పొందవచ్చు.
లెక్క ప్రకారం.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో ఏటా రూ. 25,000 పెట్టుబడి పెడితే 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ నాటికి మొత్తం రూ.3,75,000 పెట్టుబడి పెట్టినట్లు అవుతుంది. ఒక వ్యక్తి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో ఏటా రూ.25,000 పెట్టుబడి పెడితే 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ కాలంలో అతనికి వడ్డీగా మొత్తం రూ. 3,03,035 లభిస్తుంది.