సినిమా రంగంలో కొన్నిసార్లు స్టార్ హీరోల కంటే చిన్న పాత్రలే కథను మలుపు తిప్పుతుంటాయి. ముఖ్యంగా బాలనటులు తమ అమాయకత్వంతో, అద్భుతమైన నటనతో వెండితెరపై పండించే వినోదం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని...
సినిమా రంగంలో కొన్నిసార్లు స్టార్ హీరోల కంటే చిన్న పాత్రలే కథను మలుపు తిప్పుతుంటాయి. ముఖ్యంగా బాలనటులు తమ అమాయకత్వంతో, అద్భుతమైన నటనతో వెండితెరపై పండించే వినోదం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇటీవలి కాలంలో టాలీవుడ్లో సరిగ్గా ఇదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో ‘బుల్లిరాజు’ పాత్రలో రేవంత్ పలికించిన హావభావాలు, నటన థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించాయి. డైలాగ్స్ పరంగా కొంత విమర్శలు వచ్చినప్పటికీ, నటుడిగా రేవంత్ మాత్రం వందకు వంద మార్కులు కొట్టేశాడు. కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిన ఈ బుల్లోడు.. ఆ తర్వాత ‘మన శంకరవరప్రసాద్’, ‘అనగనగా ఒక రాజు’ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా రేవంత్ పేరు మారుమోగిపోతోంది.భారీ రెమ్యునరేషన్.. ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ఈ వరుస సక్సెస్‌ల నేపథ్యంలో రేవంత్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న చైల్డ్ ఆర్టిస్టుల జాబితాలో రేవంత్ అగ్రస్థానంలో నిలిచినట్లు సమాచారం. అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం, ఈ బాలనటుడు రోజుకు దాదాపు రూ. 1 లక్ష వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. అంటే నెలకు 30 రోజుల పాటు షూటింగ్ ఉంటే, రేవంత్ సంపాదన అక్షరాల 30 లక్షల రూపాయలన్నమాట. ఈ చిన్న వయసులోనే ఒక బాలనటుడికి ఈ స్థాయి డిమాండ్ ఉండటం ఇటు సోషల్ మీడియాలో, అటు సినీ ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.చేతినిండా క్రేజీ ప్రాజెక్టులుకేవలం సంపాదనలోనే కాదు, భవిష్యత్తు ప్రాజెక్టుల ఎంపికలోనూ రేవంత్ లక్కీ ఛాన్సులు కొట్టేస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రంలో రేవంత్‌కు ఒక కీలకమైన పాత్ర దక్కినట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో, పెద్ద బ్యానర్లలో వరుసగా అవకాశాలు వస్తుండటంతో రేవంత్ కెరీర్ గ్రాఫ్ వేగంగా దూసుకుపోతోంది. తన అద్భుతమైన కామెడీ టైమింగ్, యాక్టింగ్ స్కిల్స్‌తో మేకర్స్‌ను ఈ బుల్లిరాజు ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాడు.నెటిజన్ల ప్రశంసలుచిత్ర పరిశ్రమలో ఏదీ శాశ్వతం కాదనేది జగమెరిగిన సత్యం. ఈ రోజు ఉన్న క్రేజ్, రేపు మరో కొత్త నటుడు రాగానే మారిపోవచ్చు. అందుకే, లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రేవంత్ కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకోవడాన్ని నెటిజన్లు సైతం అభినందిస్తున్నారు. "దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి" అనే సామెతను బుల్లిరాజు పక్కాగా పాటిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ బాలనటుడు మరిన్ని విజయాలు అందుకోవాలని సినీ ప్రియులు ఆశిస్తున్నారు.