
‘హరేకృష్ణ’ ఫౌండేషన్‌కు రూ.1.46 కోట్లవిలువైన వంట సామగ్రి, యంత్రాల అందజేత ‘అన్నపూర్ణ’ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన రాంప్రసాద్, హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, తదితరులు మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే:...
‘హరేకృష్ణ’ ఫౌండేషన్‌కు రూ.1.46 కోట్లవిలువైన వంట సామగ్రి, యంత్రాల అందజేత
‘అన్నపూర్ణ’ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన రాంప్రసాద్, హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, తదితరులు
మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: సమాజంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనేదే రోటరీ క్లబ్ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసమే ‘అన్నపూర్ణ’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ రాంప్రసాద్ అన్నారు. ఆ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ‘అక్షయపాత్ర’ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ ప్రతినిధులు ‘అన్నపూర్ణ’ ప్రాజెక్టులో భాగంగా రూ.1.46 కోట్ల విలువైన అధునాతన వంట సామగ్రి, యంత్రాలు, రెండు వాహనాలను హరేకృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్‌కు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాంప్రసాద్ మాట్లాడుతూ ఇరు సంస్థల లక్ష్యాల్లో సామీప్యత ఉండడంతో తాము ‘హరేకృష్ణ’ ఫౌండేషన్‌కు సహకరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అక్షయపాత్ర ద్వారా రోజుకు 25 వేల మందికి ఆ సంస్థ ఆకలి తీరుస్తోందని, ఇప్పుడు తాము అందించిన చేయూతతో మరో 25 వేల మందికి ఆహారం అందించవచ్చన్నారు. అన్న క్యాంటీన్లకు, ప్రభుత్వ పాఠశాలలకు ఆహారం పంపిణీ చేసే ప్రక్రియ ఇప్పుడు మరింత వేగవంతమవుతుందని చెప్పారు. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ కన్వీనర్ డాక్టర్ రవి వడ్లమాని తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.