
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాలు మరోసారి రణరంగాన్ని తలపిస్తున్నాయి. కరాచీలో పారామిలిటరీ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా, పాకిస్థాన్ సైన్యం...
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాలు మరోసారి రణరంగాన్ని తలపిస్తున్నాయి. కరాచీలో పారామిలిటరీ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా, పాకిస్థాన్ సైన్యం ఆదివారం సరిహద్దుల్లో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడుల్లో కీలక కమాండర్‌తో సహా 28 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది.శనివారం రాత్రి కరాచీలోని సింధ్ రేంజర్స్ ప్రాంతీయ కార్యాలయంలోకి ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో దూసుకెళ్లారు. ఆ వెంటనే విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మరణించగా, నలుగురు గాయపడ్డారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. ఈ దాడికి తామే బాధ్యులమని నిషేధిత పాకిస్థానీ తాలిబాన్ (టీటీపీ) నుంచి విడిపోయిన 'జమాత్-ఉల్-అహ్రార్' సంస్థ ప్రకటించుకుంది.ఈ దాడిపై పాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున ఆఫ్ఘన్ సరిహద్దులోని బాజౌర్ జిల్లాలో భూతల దాడులు ప్రారంభించినట్లు పాక్ సమాచార మంత్రి అతావుల్లా తారార్ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో మోస్ట్ వాంటెడ్ కమాండర్ 'ఖాన్ ఫరోష్' సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం, పాక్ వైమానిక దళం అఫ్గానిస్థాన్ భూభాగంలోని పక్తియా, పక్తికా, కునార్ ప్రాంతాల్లోని ఉగ్ర స్థావరాలపై కచ్చితమైన వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మరో 25 మంది ఉగ్రవాదులు మరణించారని, వారి ఆయుధాగారాలు ధ్వంసమయ్యాయని మంత్రి వివరించారు.ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తమ దేశంలో దాడులకు పాల్పడుతున్న టీటీపీ ఉగ్రవాదులకు ఆఫ్ఘన్