
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Special Intensive Revision: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం.. ‘సర్’ ఓటరు జాబితా ప్రత్యక సమగ్ర సవరణ కార్యక్రమం ఈ నెల 25 నుంచి ప్రారంభం అయింది. ఇంకా చాలా చోట్ల పత్రాలు ప్రింట్ కాకపోవడంతో ఈ ప్రక్రియ తెలంగాణలో మందకొడిగా సాగుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ జూలై 24వ వరకు జరగనుంది. ఈ మధ్యలో బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికీ కనీసం మూడుసార్లు స్వయంగా వచ్చి ఓటర్ల వివరాల ఫారాలను పంపిణీ చేస్తారు.
ఇటీవల SIR (Special Intensive Revision) పేరుతో అనేక రకాల ప్రచారాలు సర్ పై జరుగుతున్నాయి. ఓటర్లు అందరూ డాక్యుమెంట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఓటు తొలగిస్తారనే ఓ దుష్ప్రచారం జరుగుతుంది. బూత్ లెవల్ ఆఫీసర్ "ఇంటింటికీ వచ్చి ఇబ్బంది పెడతారు" వంటి సందేశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
నిజానికి SIR ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుంటే చాలా అపోహలు తొలగిపోతాయి..
Booth Level Officer (BLO) మీ ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్/వెరిఫికేషన్ ఫారం ఇస్తారు. ఇప్పటికే మీరు ఓటరుగా నమోదు అయిఉంటే.. ఎన్నికల సంఘం (EC) వద్ద మీకు సంబంధించిన వివరాలు ఇప్పటికే ఉంటాయి. అందువల్ల మీ పేరు, EPIC నంబర్, కుటుంబ వివరాలు వంటి సమాచారం ముందుగానే ప్రింట్ చేసి ఉంటుంది. మొత్తం ఫారం మళ్లీ నింపాల్సిన అవసరం ఉండదు.
2.ఫారంలో ఉన్న వివరాలు ఒకసారి పరిశీలించాలి.
ఓటరు కార్డులో మీ పేరు సరిగా ఉందా..? పుట్టిన తేదీ (DOB) సరిగా ఉందా..? అడ్రస్ లేదా చిరునామా సరిగా ఉందా..? కుటుంబ వివరాలు సరైనవా కావా?
3.అన్నీ సరిగ్గా ఉంటే మిగిలిన అవసరమైన సమాచారం మాత్రమే నింపి సంతకం చేస్తే సరిపోతుంది.
కొన్నిసార్లు BLO అక్కడే వేచి ఉండి ఫారం తీసుకుంటారు.లేదా ఒక వారం రోజుల్లో వచ్చి తీసుకెళ్తాం" అని చెప్పి వెళ్లవచ్చు. ఒకవేళ డాక్యుమెంట్లు అవసరమైతే ఏవి ఇవ్వాలో కూడా BLO స్పష్టంగా చెబుతారు.
ప్రతి ఒక్కరూ డాక్యుమెంట్లు ఇవ్వాలనే రూల్ ఉందా..!
ప్రతి ఒక్కరూ డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నమోదైన వివరాలు సరిగ్గా ఉండి, ఎలాంటి మార్పులు లేకపోతే చాలామందికి అదనపు పత్రాలు అడిగే అవసరం ఉండకపోవచ్చు.
4.ఎప్పుడు డాక్యుమెంట్లు అవసరం అవుతాయనే విషయానికొస్తే..
ఈ పరిస్థితుల్లో మాత్రమే సంబంధిత ఆధారాలు అడిగే అవకాశం ఉంటుంది.*
ఓటరు లిస్టులో పేరు సరిచేయాలంటే.. పుట్టిన తేదీ మార్చాలంటే.. చిరునామా మారితే.. ఇతర వివరాల్లో సవరణ అవసరమైతే.. PRE-SIR మాపింగ్ లో తేడాల్లో మీరు ఉంటే మాత్రమే పత్రాలు సమర్పించాలి.
BLO (బూత్ లెవల్ ఆఫీసర్)లకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ట్రైయిన్ చేసింది. వారి వద్ద అవసరమైన మార్గదర్శకాలు, అంగీకరించే పత్రాల జాబితా ఉంటుంది. ఏదైనా సందేహం వచ్చినా వారు పై అధికారులను సంప్రదించి, ఏ పత్రాలు అవసరమో మీకు తెలియజేస్తారు. ప్రతి వ్యక్తి పరిస్థితిని బట్టి ప్రక్రియ మారతూ ఉండవచ్చు.
6. BLO వచ్చినప్పుడు ఇంట్లో లేకపోతే పరిస్థితి ఏంటి..?
చాలామందికి ఉన్న సందేహం ఇదే. చాలా మంది ఉద్యోగ రీత్యా ఉదయం బయటకు వెళితే రాత్రికి కానీ ఇంటికి రారు. "BLO వచ్చినప్పుడు ఇంట్లో లేకపోతే ఓటు తొలగిస్తారా? సమాధానం — ఓటరు జాబితాలో మీ పేరు తెలిగించరు.
--సాధారణంగా BLO... --మరోసారి మీ ఇంటికి వస్తారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తారు. --మొబైల్ నంబర్ ఉంటే ఫోన్ చేస్తారు. --తర్వాత ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలుసుకుని మళ్లీ వస్తారు.
ప్రతి BLO ఫోన్ నెంబర్ లు , హెప్ డెస్క్ నెంబర్లు ఇవన్నీ వున్నాయి. అవసరమైతే మీరు కూడా BLOని సంప్రదించి ఫారం తీసుకోవచ్చు.
మీ పోలింగ్ బూత్‌కు సంబంధించిన BLO లేదా ERO కార్యాలయానికి వెళ్లి కూడా ఫారం తీసుకోవచ్చు. ఒక్కసారి ఇంట్లో లేకపోయారని మాత్రమే ఓటు వెంటనే తొలగించరు. కానీ ఎన్నికల సంఘం ఇచ్చిన గడువులోపు ప్రక్రియ పూర్తి చేయడం మాత్రం మీ బాధ్యత అని గుర్తించుకోవాలి.
ఎన్నికల సంఘం అందించిన Voters' Service Portal ద్వారా కూడా Enumeration Form ఆన్లైన్లో సమర్పించవచ్చు.
ఆ తర్వాత BLOను తర్వాత సంప్రదించాల్సి ఉంటుంది. నేరుగా ఆన్లైన్లో ఫారం పూర్తి చేయవచ్చు. అవసరమైతే మాత్రమే సంబంధిత ఆధార పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
--BLOతో సహకరించడం.. --ఫారంలోని వివరాలు జాగ్రత్తగా పరిశీలించడం.. --అవసరమైతే మాత్రమే డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడం.. --సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సందేశాన్ని నమ్మకుండా అధికారిక సమాచారం లేదా BLO సూచనలను అనుసరించండి.
SIR ప్రక్రియలో అందరినీ ఒకే విధంగా డాక్యుమెంట్లు ఇవ్వమని అడుగుతారని అనుకోవడం సరైంది కాదు.ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశ్యం ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద ఉన్న వివరాలను ధృవీకరించడం మాత్రమే. అవసరమైన సందర్భాల్లో మాత్రమే అదనపు ఆధారాలు కోరే ఛాన్సెస్ ఉంటుంది.
కాబట్టి అనవసర గందరగోళానికి గురికాకుండా, ప్రశాంతంగా BLOతో సహకరించి ఈ ప్రక్రియను పూర్తి చేయండి. భారతీయులుగా ఎన్నికల సంఘానికి సహకరించండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.