
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Gajakesari Rajayogam Effect: జూలై నెల1, 2 3 తేదీలలో ఒక అరుదైన గజకేసరి యోగం ఏర్పడబోతుంది. దీంతో ఈ మూడు రోజులలో, మకర రాశిలో సంచరిస్తున్న చంద్రుడిని ఏడవ ఇంటి నుండి గురు, శుక్ర గ్రహాలు చూస్తున్నాయి. దీనివల్ల అఖండ రాజయోగం ఏర్పడుతుంది. ఈ గజకేసరి యోగం కొన్ని రాశుల వారికీ రెట్టింపు ఫలితాలను ఇవ్వబోతుంది. దీంతో కొన్ని రాశులకు ఆదాయంలో వృద్ధి, శక్తి యోగం, విజయాలు వరించనున్నాయి. అంతేకాదు మీ కీర్తి ప్రతిష్టలు నూటికి నూరు శాతం పెరుగుతాయి. ఈ అరుదైన యోగం మేష, కర్కాటక, కన్య, తుల, మకర మీన రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతున్నట్టు గ్రహ గోచారం చెబుతున్న మాట. కొత్త ప్రయత్నాలకు ఇదే శుభ సమయం.
కర్కాటక రాశి: కర్కాటక రాశిలో, గురు గ్రహం ఉచ్చ స్థితిలో ఉండగా, ఏడవ ఇంట్లో బుధ, శుక్ర గ్రహాలు పరిపూర్ణమైన దృష్టిని ఏర్పరుస్తున్నాయి. . దీని ఫలితంగా కర్కాటక రాశి వారికి అద్భుతమైన గజకేసరి, కుబేర యోగం సిద్దిస్తుంది. దీనివల్ల రాజపూజ్యం లభించనుంది. రజ, ధన యోగాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. చేసే పనిలో విజయం సాధిస్తారు.
కన్య రాశి: పంచమ స్థానంలో చంద్రుడు, ఉచ్చస్థానంలో గురు, బుధ, శుక్ర గ్రహాల దృష్టి కారణంగా, కన్య ారాశి వారు తాకిన ప్రతిదీ బంగారంగా మారుతుంది. జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. వ్యాధులు, రుణ సమస్యలపై విజయం సాధిస్తారు. మీ ఆదాయం గతంలో కంటే గణనీయంగా పెరుగుతుంది.
మేష రాశి: మేష రాశిలో నాలుగవ ఇంట్లో గురు, బుధ, శుక్ర గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండటం వలన, దశమం స్థానంలో ఉన్న చంద్రుని దృష్టి మేష రాశికి గజకేసరి యోగం, ధన సమృద్ధి యోగాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల ఉద్యోగంలో ఖచ్చితంగా ఉన్నత స్థానం లభిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు వరించనున్నాయి. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం కోసం చేసే ఏ ప్రయత్నమైనా ఫలించే అవకాశం ఉంది. మీ ఆదాయం గతంలో కంటే విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
తులా రాశి: తులా రాశిలో నాలుగవ స్థానంలో ఉన్న చంద్రుడిపై దశమ స్థానంలో మూడు శుభ గ్రహాల దృష్టి ఉండటం వల్ల, ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభించనున్నాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా హోదా పెరిగే అవకాశం ఉంది. మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఊహించని ప్రయోజనాలు సిద్ధించనున్నాయి. ఈ మూడు రోజుల్లో మీరు చాలా శుభవార్తలు వింటారు.
మీన రాశి: మీన రాశిలో శుభస్థానంలో ఉన్న చంద్రుడిపై గురు, శుక్ర, బుధ గ్రహాల దృష్టి వలన రాజయోగం ఏర్పడుతుంది. మీరు సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. మీరు రాజకీయ పలుకుబడిని పొందుతారు. అనేక మార్గాల నుండి ఆదాయం లభించనుంది. ఉద్యోగంలో మీ జీతం పెరగనున్నాయి. మీ జీత భత్యాలు గణనీయంగా పెరుగుతాయి.
గమనిక (Disclaimer): ప్రియ పాఠకులారా, ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, గ్రహ గోచారం ఆధారంగా ఇవ్వబడింది. ఇది వ్యక్తులు తాము పుట్టిన సమయంలో ఉన్నటు వంటి గ్రహ గోచారం ఆధారంగా మారుతూ ఉంటుంది. జీ న్యూస్ ఈ వార్తను ధృవీకరించడం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.