
సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో రూ.6.57 కోట్ల వ్యయంతో కొత్తగా 177 మార్చురీ ఫ్రీజర్ ఛాంబర్లను కూటమి ప్రభుత్వం సమకూరుస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రూ.6.
57 కోట్లతో కొనుగోలు: మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో రూ.6.57 కోట్ల వ్యయంతో కొత్తగా 177 మార్చురీ ఫ్రీజర్ ఛాంబర్లను కూటమి ప్రభుత్వం సమకూరుస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఒక్కో ఫ్రీజర్కు రూ.3.71 లక్షలు వ్యయం చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రీజర్ల అమరికకు తగ్గట్లు మార్చురీ గదుల విస్తీర్ణం పెంచుతున్నామని, ఒక్కో ఫ్రీజర్ ఛాంబర్లో రెండు మృతదేహాలను భద్రపరిచే సౌకర్యాన్ని కల్పించామని వివరించారు. చాలా ఆస్పత్రుల్లో కాలం చెల్లిన ఫ్రీజర్లతో రకరకాల సమస్యలు నెలకొన్నాయని తెలిపారు. దీంతో 119 కమ్యూనిటీ ఆస్పత్రులు, 49 ఏరియా ఆస్పత్రులు, 8 జిల్లా ఆస్పత్రులకు కొత్తగా మార్చురీ ఫ్రీజర్ ఛాంబర్లను కొనుగోలు చేశామన్నారు. త్వరలో మిగిలిన ఆస్పత్రులకు కూడా అందిస్తామని తెలిపారు.