
ఇంటర్నెట్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో (Pune Murder) కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అతడికి కాబోయే భార్య సియా గోయల్ (Siya Goyal), తన ప్రియుడు చేతన్ చౌదరి (Chetan Chowdary)తో కలిసి హత్య చేసిందని మృతుడి తండ్రి చెబుతున్నారు. పక్కా వ్యూహం ప్రకారమే కేతన్‌ను హత్య చేసినట్లు తాజాగా సీన్ రీ క్రియేషన్ తర్వాత తెలిసిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నిజానికి జూన్ 4నే కేతన్ అగర్వాల్ హత్యకు వీరిద్దరూ పన్నాగం పన్నారు. కానీ, ఆ రోజు కుదరలేదు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం జూన్ 18న అమలు చేసేందుకు వ్యూహరచన చేశారు. ఉదయం 7 నుంచి దాదాపు 10 గంటల పాటు వ్యూహాన్ని అమలుపరిచినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే చేతన్‌ను విడిగా సీన్ రీ క్రియేషన్ కోసం తీసుకురానున్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి. తద్వారా హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టవచ్చని భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు.
పెళ్లి పత్రికల సేకరణతో గిన్నిస్ రికార్డు సాధించిన కేరళ వాసి.. తన కుమారుడి వివాహానికి వినూత్నమైన శుభలేఖను ఎంచుకున్నారు.