
సింగిల్ ఛార్జ్‌తో 95 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 3.5-అంగుళాల కలర్ ఎల్సీడీ డిస్ప్లే అమర్చారు
బ్రేకింగ్ కోసం హైడ్రాలిక్ టెక్ట్రో డిస్క్ బ్రేకులు ఉన్నాయి Urtopia e-bike : యుర్టోపియా కొత్త ఎలక్ట్రిక్ బైక్ కార్బన్ ఆటమ్ లాంచ్ చేసింది. కంపెనీ నుంచి హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే. చాలా లైట్ వెయిట్ ఉండి స్ట్రాంగ్ డిజైన్ అందిస్తుంది. ఈ ఇ-బైక్ 750W మోటార్‌తో రన్ అవుతుంది. 802Wh బ్యాటరీతో వస్తుంది. ఇందులో 8-స్పీడ్ సిస్టమ్, స్పీడ్ కంట్రోలింగ్ కోసం టెక్ట్రో హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర, ఇతర ముఖ్య ఫీచర్లకు సంబంధించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇ-బైక్ ధర ఎంతంటే? : అర్టోపియా కార్బన్ ఆటమ్ ఇ-బైక్ ధర 2,499 డాలర్లు (దాదాపు రూ. 235,000). కంపెనీ (Urtopia e-bike) ఫ్రీగా మడ్‌గార్డ్ కిక్స్టాండ్ను అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రస్తుతానికి యూఎస్ మార్కెట్లో లాంచ్ అయింది. మూన్లైట్, కాపర్, ఆలివ్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి ఎలక్ట్రిక్ బైకు కొనేసుకోవచ్చు. ఆటమ్ ఇ-బైక్ ఫీచర్లు : ఈ కార్బన్ ఆటమ్ బైక్‌లో 750-వాట్ల అవుట్‌పుట్ హబ్ మోటార్ ఉంది. 1,250 వాట్ల టాప్ అవుట్‌పుట్‌ను 90Nm వరకు టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 802Wh సామర్థ్యంతో భారీ బ్యాటరీ అమర్చారు. యాక్సెసరీలు లేకుండా ఈ ఎలక్ట్రిక్ బైక్ బరువు 58 పౌండ్లు, లేదా సుమారుగా 26 కిలోలు ఉంటుంది. Read Also : Moto Pad 70 Pro : 10200mAh బ్యాటరీ, 3.5K డిస్ప్లేతో కొత్త మోటో ప్యాడ్ 70 ప్రో ట్యాబ్ అదుర్స్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. చాలా లైట్ వెయిట్ ఇ-బైక్ కూడా. కార్బన్ ఆటమ్ ఇ-బైక్‌లో 8-స్పీడ్ షిమానో అసేరా డెరేలర్ ఉంది. బ్రేకింగ్ కోసం హైడ్రాలిక్ టెక్ట్రో డిస్క్ బ్రేకులు ఉన్నాయి. 80 మిల్లీమీటర్ల ట్రావెల్ ఫ్రంట్ సస్పెన్షన్ ఫోర్క్ ఉంది. కార్బన్ ఫ్రేమ్ వైబ్రేషన్ తగ్గిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ లేదు. సౌకర్యం కోసం సస్పెన్షన్ సీట్పోస్ట్ ఉంది. 3.5-అంగుళాల కలర్ ఎల్సీడీ డిస్ప్లే, 26-అంగుళాల కెండా టైర్లు, ఇంటిగ్రేటెడ్ రియర్ లైట్ అమర్చి ఉన్నాయి. హ్యాండిల్‌బార్‌లో హెడ్‌లైట్ కూడా ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 95 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు.