
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కొత్తూరు గ్రామ శివారులో చిరుతపులి సంచారంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆయిల్ పామ్ తోటలో చిరుతపులి సంచరించిన ఆనవాళ్లు కనిపించడంతో ఓ రైతు అటవీశాఖ అధికారు
లకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు చిరుతపులి పాదముద్రలు గుర్తించారు. సీసీ కెమెరాలు పరిశీలించి చిరుత జాడ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామాల ప్రజలు ఎవరూ అటవీ ప్రాంతంవైపు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఈ వార్త చదివారా: మద్యం అమ్మిన ఆరుగురి ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగించిన సర్పంచ్