
ఐక్యూ ఫోన్లో శాంసంగ్ డిస్ప్లే కూడా ఉండొచ్చు భారీ 6.8-అంగుళాల డిస్ప్లేతో రావొచ్చు ఈ ఫోన్లో అమోల్డ్ ప్యానెల్ ఉంటుందని అంచనా iQOO 16T : కొత్త ఐక్యూ ఫోన్ కొంటున్నారా?
మీకోసం అతి త్వరలో ఐక్యూ 16T రాబోతుంది. కంపెనీ ఐక్యూ 16 సిరీస్‌లో ఐక్యూ 16T అనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించి అనేక ఫీచర్లు లీక్ అయ్యాయి. ఐక్యూ 16 కంపెనీ ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే చీపెస్ట్ వెర్షన్‌గా ఐక్యూ 16టీగా రిలీజ్ కానుంది. ఐక్యూ 16 లాంచ్ ఇప్పట్లో లేదు. అంతకన్నా ముందుగానే ఐక్యూ 16T ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి.. ఈ సిరీస్‌లో ఫ్లాగ్షిప్ మోడల్ ఐక్యూ 16 ఫోన్ 6.85-అంగుళాల డిస్ప్లేతో రావచ్చు. ఈ ఫోన్లో శాంసంగ్ డిస్ప్లే ఉంటుందని అంచనా. అలాగే, అమోల్డ్ ప్యానెల్ కూడా ఉంటుందని అంటున్నారు. ఐక్యూ 16T ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. Read Also : Samsung Galaxy M47 5G : 6000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో శాంసంగ్ కొత్త 5G ఫోన్.. కీలక స్పెసిఫికేషన్లు లీక్! లీకులను పరిశీలిస్తే.. ఈ ఐక్యూ 16టీ సరికొత్త ఫోన్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది. ఈ ఫోన్లో సింగిల్ డిస్ప్లే ఉండొచ్చు. ఐక్యూ 15టీలో 6.82 అంగుళాల భారీ డిస్ప్లే అందించింది. కానీ, కొత్త ఐక్యూ 16T ఫోన్ మాత్రం 6.8 అంగుళాల డిస్ప్లేతో రావొచ్చు. ఇందులో అమోల్డ్ ప్యానెల్ ఉండొచ్చు. ఈ సిరీస్‌లో ఫ్లాగ్షిప్ మోడల్ ఐక్యూ 16లో కూడా 6.85-అంగుళాల డిస్ప్లే ఉంటుందని అంచనా. అది కూడా అమోల్డ్ ప్యానెల్ అయి ఉంటుందని భావిస్తున్నారు. 2K హై-రిజల్యూషన్ డిస్ప్లే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఐక్యూ నియో 11Sతో పాటు కంపెనీ ఐక్యూ నియో 12 కూడా లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఫోన్‌ను భారీ డిస్ప్లేతో కూడా లాంచ్ చేయవచ్చు. ఇందులో 6.83-అంగుళాల స్క్రీన్, అమోల్డ్ ప్యానెల్ ఉండొచ్చు. వాస్తవానికి, ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.