
విశాఖపట్నం: చూడటానికి ఒకేలా ఉండే కవలలు.. ఒకే రకమైన ట్రెండీ దుస్తులు ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తూ అదరగొడితే ఆ మజానే వేరు..
Jun 28 2026 1:15 PM | Updated on Jun 28 2026 1:25 PM
విశాఖపట్నం: చూడటానికి ఒకేలా ఉండే కవలలు.. ఒకే రకమైన ట్రెండీ దుస్తులు ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తూ అదరగొడితే ఆ మజానే వేరు.. సరిగ్గా ఇలాంటి వినూత్న దృశ్యమే శనివారం సాయంత్రం నగరంలోని రిలయన్స్ సెంట్రో వేదికగా ఆవిష్కృతమైంది. కవలల్లో దాగి ఉన్న ప్రతిభను, వారి మధ్య ఉండే ప్రత్యేక అనుబంధాన్ని ప్రోత్సహించేందుకు ‘ది ట్విన్స్ ఎడిట్’ పేరిట నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోకు విశేష స్పందన లభించింది.
చిన్నారుల నుంచి యువతీ యువకుల వరకు మొత్తం 15 జతల కవలలు ఈ పోటీలో పాల్గొని సందడి చేశారు. ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ వారు చేసిన ర్యాంప్ వాక్, క్విజ్, ఇతర ప్రదర్శనలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సెంట్రో ఎస్జీఎం వెంకట్ నారాయణ మాట్లాడుతూ.. కవలల మధ్య ఉండే స్టైల్, ప్రత్యేక బంధాన్ని ఈ వేదిక ప్రతిబింబించిందన్నారు. అనంతరం నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో శాన్వి–శైవి ప్రథమ స్థానంలో నిలవగా, శ్రీరమ్య–శ్రీలిఖిత ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పోటీలో పాల్గొన్న కవలలందరికీ గిఫ్ట్ హ్యాంపర్లు అందజేశారు.
ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు)
చీరలో సింగారించుకుని అందంగా అనసూయ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 28 - జూలై 05)
నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)
రేయ్ JC... నా జోలికి రాకు! ఈసారి మాటలతో చెప్పను...
ఎవడి సొమ్ము అని మా భూములు అడుగుతున్నావ్.. అసలు ఈ గొడవకు కారణం ?
మేడిపల్లి PS పరిధిలో దారుణం.. గృహప్రవేశం జరిగిన ఇంటిపై దాడి
200 భాషల్లో వారణాసి.. జక్కన్నను ఆకాశానికి ఎత్తేసిన ప్రియాంక