
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ టీమిండియాకు డూ ఆర్ డై పరిస్థితి నెలకొంది. టోర్నీలో భాగంగా సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఆస్ట్రేలియాపై హర్మన్ సేన తప్పక గెలవాల్సి ఉంది.
Jun 28 2026 1:26 PM | Updated on Jun 28 2026 1:42 PM
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ టీమిండియాకు డూ ఆర్ డై పరిస్థితి నెలకొంది. టోర్నీలో భాగంగా సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఆస్ట్రేలియాపై హర్మన్ సేన తప్పక గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా అంటే భయం లేదని, తమ సత్తా ఏంటో మ్యాచ్‌లో చూపిస్తామని మంధాన తెలిపింది.
మంధాన మాట్లాడుతూ..'ఈ టోర్నీలో భారత బ్యాటింగ్ యూనిట్ తమ పూర్తి సామర్థ్యాన్ని ఇంకా ప్రదర్శించలేదని అంగీకరించింది. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడాలని మేమంతా భావిస్తున్నాం. కానీ ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో అది సాధ్యపడలేదు. అయితే ప్రతి బ్యాటర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మా అసలైన ఆటను చూపించాలనుకుంటున్నాం. గత నాలుగైదేళ్లలో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాతో పోటీపడే స్థాయికి చేరుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్ లో భారత ఆటగాళ్లు ఆడటం వల్ల ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం పెరిగింది. ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్‌లోనే మేము మంచి ప్రదర్శన చేశాం. ఆ అనుభవం మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది.
గతంతో పోలిస్తే రెండు జట్ల మధ్య అంతరం చాలా తగ్గింది. విదేశీ లీగ్‌ల అనుభవం కూడా మాకు ఎంతో ఉపయోగపడుతోంది. నా సహచర ఓపెనర్ షెఫాలీ వర్మతో కలిసి జట్టుకు బలమైన ఆరంభం ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నా.షెఫాలీ ప్రస్తుతం బంతిని అద్భుతంగా టైమ్ చేస్తోంది. మేమిద్దరం కలిసి జట్టుకు బలమైన పునాది వేయగలిగితే మ్యాచ్‌పై పట్టుసాధించడం సులభమవుతుంది. ఇక ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరతో ఇటీవల బ్యాటింగ్‌కు సంబంధించి పలు విషయాలను చర్చించినట్లు స్మృతి వెల్లడించింది. చిన్నప్పటి నుంచే వారిద్దరి ఆటను చూసి ఎంతో నేర్చుకున్నానని తెలిపింది.
'హేడెన్ కామెంటరీ చేస్తుండగా కలిసే అవకాశం వచ్చింది. బ్యాటింగ్ గ్రిప్‌తో పాటు కొన్ని సాంకేతిక అంశాలపై చర్చించాను. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు మీతో మాట్లాడుతున్నానంటే మీకు ఇబ్బందిగా లేదా అని సరదాగా అడిగాను. కానీ ఆయన ఎంతో ఆప్యాయంగా పలు విలువైన సూచనలు చేశారు. వాటిని మ్యాచ్‌లో అమలు చేయాలని ఆశిస్తున్నాను' అని స్మృతి మంధాన చెప్పింది.
Read: ఫిఫా చరిత్రలో అరుదైన ఘట్టం.. ఆ 9 దేశాలు నాకౌట్‌కు!
ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు)
చీరలో సింగారించుకుని అందంగా అనసూయ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 28 - జూలై 05)
నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)
రేయ్ JC... నా జోలికి రాకు! ఈసారి మాటలతో చెప్పను...
ఎవడి సొమ్ము అని మా భూములు అడుగుతున్నావ్.. అసలు ఈ గొడవకు కారణం ?
మేడిపల్లి PS పరిధిలో దారుణం.. గృహప్రవేశం జరిగిన ఇంటిపై దాడి
200 భాషల్లో వారణాసి.. జక్కన్నను ఆకాశానికి ఎత్తేసిన ప్రియాంక