
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అయితే, ఇది ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన జట్టులోని సీనియర్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలేం జరిగిందంటే?
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్ మూడో టెస్టులో తలపడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 438 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ కూడా 354 పరుగులు చేసిన ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 120 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 114వ ఓవర్‌ను షోయబ్ బషీర్ వేశాడు. రిటర్న్ క్యాచ్‌ను అందుకొన్న బషీర్ కివీస్ బ్యాటర్ నాథన్ స్మిత్‌ను ఔట్ చేశాడు. సహచరులంతా బషీర్‌ను అభినందించేందుకు వచ్చారు. కానీ, బౌండరీ లైన్ వద్ద ఉన్న జోఫ్రా ఆర్చర్ మాత్రం రాలేదు. దీంతో కెప్టెన్ బెన్ స్టోక్స్ పెద్దగా ఆర్చర్‌ను పిలుస్తూ వీడియోల్లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చి బషీర్‌ను ఆర్చర్ అభినందించాడు. అయితే, అంతకుముందు ఆర్చర్ వేసిన ఓవర్లో టామ్ బ్లండెల్ ఇచ్చిన క్యాచ్‌ను బషీర్ చేజార్చాడు. దీంతో బషీర్ వికెట్ తీసినా అభినందించేందుకు రాలేదు. కానీ, కెప్టెన్ ఆగ్రహంతో ఆర్చర్‌కు రాకతప్పలేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.