
Jyestha Purnima 2026 Zodiac Telugu: జ్యేష్ట పౌర్ణమి జూన్ 29వ తేదీన వచ్చింది. దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది.
ముఖ్యంగా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Jyestha Purnima 2026 Zodiac Telugu: ఈ సంవత్సరం జ్యేష్ట పౌర్ణిమ జూన్ 29వ తేదీన జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయంలో దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. సనాతన ధర్మంతో పాటు జ్యోతిష్య శాస్త్రంలో జ్యేష్ట పౌర్ణమిని అత్యంత శుభప్రదమైన రోజుగా భావిస్తారు. ఈ రోజునే చంద్రుడు సంపూర్ణంగా ప్రకాశిస్తూ ఉంటాడు. జ్యేష్ట మాసం ముగింపును, ఆషాడ మాసం ప్రారంభాన్ని ఈరోజు సూచిస్తుంది. అయితే ఈ పౌర్ణమి రోజున అనేక గ్రహాలు కదలికలు చేయబోతున్నాయి.
ముఖ్యంగా జ్యేష్ట పౌర్ణమి నుంచి కొన్ని రాశుల వారికి ఈ సమయంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా బోలెడు లాభాలు కలగడమే కాకుండా గతంలో ఉన్న సమస్యలన్నీ ఎంతో సులభంగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా అనుకున్న పనుల్లో ఊహించని స్థాయిలో విజయాలు కూడా సాధించగలుగుతారు. అయితే జ్యేష్ట పౌర్ణమి ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
జ్యేష్ట పౌర్ణిమ మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి నిలిచిపోయిన పనులు ఎంతో సులభంగా ఉబందుకుంటాయి. ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ సమయంలో తప్పకుండా అద్భుతమైన ప్రశంసలు లభిస్తాయి. అంతేకాకుండా పదోన్నతులు లభించే అవకాశాలున్నాయి. పెద్ద వ్యాపార ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. ఈ సమయంలో వీరికి సామాజిక హోదా కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో అదృష్టం అంచలంచలుగా పెరుగుతుంది. ముఖ్యంగా వీరికి గణనీయమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులందరికీ ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా గణనీయమైన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రేమ వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.
తులారాశిలో జన్మించిన వ్యక్తులకు జ్యేష్ట పౌర్ణమి నుంచి మనశ్శాంతి లభించబోతోంది. అంతేకాకుండా ఆర్థిక శ్రేయస్సు లభించి.. కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ముఖ్యంగా కళాతోపాటు మీడియా రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులందరికీ గొప్ప గొప్ప అవకాశాలు లభిస్తాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలున్నాయి..
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగాలు కోరుకుంటున్న యువత తప్పకుండా అద్భుతమైన శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ.. జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు. ఇప్పటికే కోర్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులందరికీ పరిష్కారం లభిస్తుంది..