
హెచ్1-బీ వీసా విధానంలో ఇటీవల ట్రంప్ యంత్రాగం మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇది ప్రత్యేకంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న చర్యగా భావించకూడదని భారత్‌కు అమెరికా రాయబారి సెర్గియో గోర్...
హెచ్1-బీ వీసా విధానంలో ఇటీవల ట్రంప్ యంత్రాగం మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇది ప్రత్యేకంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న చర్యగా భావించకూడదని భారత్‌కు అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. అమెరికా వలస విధానంలో చేపట్టిన సమగ్ర సంస్కరణల్లో భాగంగానే దీనిని చేపట్టినట్లు వెల్లడించారు. అమెరికా తన మొత్తం వలస విధానాన్ని, అన్ని రకాల వీసాల వ్యవస్థలను సమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. హెచ్-1బీ వీసాపై ఆందోళనలు, అమెరికాలో పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. H1-B వీసాలు.. భారత్‌ను లక్ష్యంగా చేసుకోలేదు |