
క్రీడారంగంలోని రెండు వేరు వేరు ఆటలకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో మెరిశారు. భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం, 2002 ప్రపంచకప్ విజేత రొనాల్డిన్హో...
క్రీడారంగంలోని రెండు వేరు వేరు ఆటలకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో మెరిశారు. భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం, 2002 ప్రపంచకప్ విజేత రొనాల్డిన్హో నజారియో అమెరికాలో కలిశారు.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడాలకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో మెరిశారు. భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం, 2002 ప్రపంచకప్ విజేత రొనాల్డిన్హో నజారియో అమెరికాలో కలిశారు. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లను వీక్షించేందుకు అమెరికా వెళ్లిన గిల్.. అక్కడ రొనాల్డిన్హోను కలిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను గిల్ సోషల్ మీడియాలో పంచుకోగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయాన్ని అందుకున్న గిల్.. 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు.
ఇదిలావుండగా ఫుట్‌బాల్ అభిమానులకు రొనాల్డిన్హో ఒక శుభవార్త చెప్పాడు. 2015లో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పిన ఈ 46 ఏళ్ల మాజీ బ్రెజిల్ స్టార్.. దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ బూట్లు తొడగనున్నాడు. ఇటలీకి చెందిన థర్డ్ టైర్ క్లబ్ 'రావెన్నా' తో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈనెల 23న మయామిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ఆయనను జట్టులోకి ఆహ్వానించారు. మొదట ప్రమోషన్ల కోసమే రొనాల్డినోను తీసుకున్నట్లు క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అరియాడో బ్రెయిడా చెప్పినప్పటికీ, ఆ తర్వాత ఆయన మైదానంలోకి దిగే అవకాశాలను కొట్టిపారేయలేమని స్పష్టం చేశారు.
2015లో ఫ్లూమినెన్స్ తరఫున తన చివరి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడినప్పటి నుంచి రొనాల్డిన్హో లెజెండ్స్ మ్యాచ్‌లలో క్రమం తప్పకుండా ఆడుతున్నారు. తాజాగా అతడి కోచ్ ఆండ్రియా మాండోర్లిని ఆధ్వర్యంలో రావెన్నాతో ప్రొఫెషనల్ క్లబ్ ద్వారా తిరిగి మైదానంలోకి వస్తున్నాడు. 'కొత్త రంగులు.. అదే చిరునవ్వు.. నా అందమైన ఆటతో రావెన్నా క్లబ్లో సరికొత్త చరిత్ర లిఖించడానికి వేచి చూస్తున్నా' అంటూ రొనాల్డినో తన పునరాగమనంపై సంతోషం వ్యక్తం చేశారు.
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ కప్‌లో ఐర్లాండ్ తొలి విజయం