
ప్రస్తుతం సొంతంగా కారు, బైకు లేకున్నా ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి యాప్‌ల పుణ్యమాని క్షణాల్లో రైడర్లు మన ముందు వాలిపోతున్నారు. వారి వాహనం ఎక్కి ఓటీపీ చెబితే.. మనం వెళ్లాలనుకున్న చోటుకి తీసుకెళ్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు చెక్‌పోస్టు వద్ద తల్లి లేని ఓ కోతిపిల్లకూ రైడ్ అవసరమైనట్లు ఉంది. అక్కడ ఓ శునకం కనిపించగానే నువ్వే నా ర్యాపిడో రైడర్ అన్నట్లు దాని వీపెక్కి కూర్చుంది. అది కూడా ఓటీపీ చెబితే రైడ్ మొదలుపెడతా అన్నట్లు వేచిచూస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.