
వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో శనివారం అమెరికా సైన్యం ఇరాన్ లక్ష్యాలపై భారీ దాడులు జరిపింది. ఇరాన్‌కు చెంది
న నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ కేంద్రాలు, గగనతల రక్షణ స్థావరాలు, డ్రోన్ గిడ్డంగుల, సముద్రపు మైన్లను అమర్చే సామర్థ్యాలపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. పనామా పతాకంతో ప్రయాణిస్తున్న 'కికు' అనే ముడిచమురు నౌకపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడిన నేపథ్యంలో అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ఈ ప్రతీకార చర్యలు చేపట్టింది.అమెరికా సైనిక వర్గాల సమాచారం ప్రకారం, 20 లక్షల బ్యారెళ్లకు పైగా ముడిచమురుతో ప్రయాణిస్తున్న 'కికు' నౌక హర్మూజ్ జలసంధి సమీపంలో శనివారం తెల్లవారుజామున ఇరాన్ డ్రోన్ దాడికి గురైంది. ఈ ప్రమాదంలో సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని, పర్యావరణానికి కూడా ఎటువంటి నష్టం వాటిల్లలేదని ప్రాథమిక నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నౌక ఖతార్ చమురు క్షేత్రం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) రేవుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.ముదిరిన ఉద్రిక్తతలుఇరాన్ చర్యలపై తీవ్రంగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశం కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని ఆరోపిస్తూ దాడులకు ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ గనుక పద్ధతి మార్చుకోకపోతే, ఆ దేశ ఉనికి ప్రమాదంలో పడుతుందని సామాజిక మాధ్యమాల వేదికగా హెచ్చరించారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ ఏవైనా విభేదాలు ఉంటే హింస ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరాన్‌కు సూచించారు.గత రెండు రోజుల్లో అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి.