
Washington Sundar Replacements: భారత టీ20 జట్టులో స్పిన్ ఆల్‌రౌండర్ స్థానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సుదీర్ఘకాలంగా అవకాశాలు పొందుతున్నా ఆకట్టుకోలేకపోతున్న వాషింగ్టన్ సుందర్ ఫామ్ సెలెక్టర్లకు...
Washington Sundar Replacements: భారత టీ20 జట్టులో స్పిన్ ఆల్‌రౌండర్ స్థానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సుదీర్ఘకాలంగా అవకాశాలు పొందుతున్నా ఆకట్టుకోలేకపోతున్న వాషింగ్టన్ సుందర్ ఫామ్ సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరపున బ్యాటర్‌గా పర్వాలేదనిపించినా, బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో బాధ్యతారహితమైన షాట్ ఆడి వికెట్ పారేసుకోవడమే కాకుండా, బౌలింగ్‌లోనూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 2017లో అరంగేట్రం చేసిన సుందర్, ఇప్పటివరకు 61 అంతర్జాతీయ టీ20లు ఆడినా ఎక్కడా తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో 2028 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ సుందర్ స్థానాన్ని భర్తీ చేయగల ముగ్గురు అద్భుతమైన ఆటగాళ్లపై కన్నేసింది. ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఝార్ఖండ్ స్టార్ ఆల్‌రౌండర్ అనుకుల్ రాయ్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గత సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఏకంగా 18 వికెట్లు పడగొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున బౌలింగ్‌తో పాటు అవసరమైనప్పుడు బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించాడు. వాషింగ్టన్ సుందర్ తరహాలోనే స్పిన్ వేయగల, దిగువ వరుసలో వేగంగా పరుగులు రాబట్టగల సామర్థ్యం అనుకుల్ సొంతం. భారత జట్టుకు కావలసిన అసలైన లోయర్-ఆర్డర్ హిట్టర్ మరియు వికెట్ టేకింగ్ ఆప్షన్‌గా అనుకుల్ రాయ్ సరిగ్గా సరిపోతాడు.
ఇది కూడా చదవండి: IND vs IRE: ఆ ఇద్దరే టీమిండియాకు పట్టిన దరిద్రం.. అర్జెంటుగా పీకేయండి.. లేదంటే 2వ మ్యాచ్ కూడా..!
ఇండియా-ఎ జట్టులో నిలకడగా రాణిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన యువ ఆటగాడు హర్ష్ దూబే. ఇప్పటికే టెస్టు, వన్డే జట్లకు ఎంపికైన ఈ విదర్భ ఆల్‌రౌండర్, టీ20ల్లోనూ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ హర్ష్ దూబే ప్రతిభను నమ్మి వరుసగా అవకాశాలు ఇచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కేవలం 6.35 ఎకానమీతో బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేయడంలో తనేంటో నిరూపించుకున్నాడు. సుందర్‌కు ప్రత్యామ్నాయంగా సుదీర్ఘకాలం జట్టుకు సేవలందించగల సత్తా ఈ యువకుడికి ఉంది.
ఇది కూడా చదవండి: కెప్టెన్‌గా తొలి మ్యాచ్.. ఆ చెత్త లిస్ట్‌లో నంబర్ 1గా శ్రేయాస్.. నెక్ట్స్ పేరు చూస్తే ఫ్యాన్స్ హర్ట్ అవ్వాల్సిందే?
3. కృనాల్ పాండ్యా: అనుభవజ్ఞుడైన మ్యాచ్ విన్నర్..
వాషింగ్టన్ సుందర్ స్థానాన్ని తక్షణమే భర్తీ చేయగల అత్యంత నమ్మకమైన ఆటగాడు కృనాల్ పాండ్యా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున గత రెండు ఐపీఎల్ సీజన్లలో కృనాల్ బంతితో అద్భుతాలు చేశాడు. ఐపీఎల్ 2025లో 17 వికెట్లు, 2026లో 15 వికెట్లు తీసి అత్యంత నిలకడైన ప్రదర్శన ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ కుప్పకూలినప్పుడు జట్టును ఆదుకోగల సీనియారిటీ కృనాల్‌కు ఉంది. 35 ఏళ్ల వయసున్నప్పటికీ, స్వల్పకాలిక లక్ష్యంగా 2028 ప్రపంచకప్ కోసం కృనాల్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంటే భారత స్పిన్ విభాగం మరింత బలోపేతం అవుతుంది.
ఇది కూడా చదవండి: IND vs IRE: ఐర్లాండ్ చేతిలో ఇప్పటి వరకు ఓడిపోని ‘3 టీంలు’.. లిస్ట్‌లో 2వ పేరు షాకింగ్ భయ్యో..!
మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..