
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుసగా రెండో రోజు దాడులకు దిగింది. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది.
కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. తమ నౌకా దళం, వైమానిక దళాలు సంయుక్తంగా ఈ దాడులు ప్రారంభించినట్లు ఐఆర్జీసీ ఆదివారం తెల్లవారుజామున ప్రకటించింది. అంతకుముందు హర్మూజ్ జలసంధి సమీపంలోని టెహ్రాన్ లక్ష్యాలపై యూఎస్ బలగాలు దాడులు చేపట్టాయి. క్షిపణి, డ్రోన్ దాడులతో విరుచుకుపడ్డ ఇరాన్ |