
Shukra Mahardasha 2026: జ్యోతిష్య శాస్త్రంలో, ప్రేమ, సౌందర్యం, విలాసవంతమైన జీవితానికి శుక్ర గ్రహం ప్రతీక. మీ సంపదకు పెంచే అవకాశాలున్నాయి.
అవును కొన్ని గ్రహాలు తమ స్థానాలను మార్చుకోవడం ద్వారా కొన్ని శుభ యోగాలు ఇస్తుంటాయి. ఇక కొంత మంది వ్యక్తుల గోచారం ప్రకారం శుక్ర మహర్ధశ అనేది అత్యంత కీలకమైనదిగా భావించాలి.
Shukra Gocharam 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్ర గ్రహం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ప్రసాదించబోతుంది. ఈ సమయంలో వారు మట్టిని తాకినా అది బంగారంగా మారుతుందని గ్రహ గతులు చెబుతున్నాయి. వేద జ్యోతిష్య శాస్త్రంలో, ప్రేమ, సౌందర్యం, విలాసం, అదృష్టానికి అధిపతి అయిన శుక్ర గ్రహం ఏ వ్యక్తి జాతకంలోనైనా శుభ స్థానంలో ఉంటే, వారి జీవితం బంగారు మయంగా మారబోతుంది. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం, కొన్ని రాశుల వారికి సంపదకు అధిపతి శుక్రుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. ఈ సమయంలో నాలుగు రాశుల వారికి సంపద వర్షం కురిపిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
మిథున రాశి వారికి శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు. ఈ కాలంలో కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇంట్లో సంతోషం తాండవిస్తుంది. విదేశీ వ్యవహారాల్లో కూడా భారీ లాభాలు కలగనున్నాయి.
శుక్రుని ప్రభావం వల్ల మకర రాశి వారికి గత కొంత కాలంగా బకాయిపడిన అప్పుల నుండి విముక్తి పొందే అవకాశాలున్నాయి. ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో శాంతి, ప్రశాంతత నెలకొంటాయి. నిరుద్యోగులు తాము కోరుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలున్నాయి.
శుక్రుని ప్రభావం వల్ల మేష రాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగబోతుంది. ఇది తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి అనుకూలమైన సమయం. పెట్టుబడుల నుండి భారీ ఆదాయం ఆశించవచ్చు. వ్యాపారంలో ఆదాయం అమాంతం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం, సౌకర్యం పెరుగబోతున్నాయి.
వృశ్చిక రాశి వారికి కూడా సంపదను ఇచ్చే శుక్రుని ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధించే అవకాశాలున్నాయి. వీరిపై లక్ష్మీదేవి తప్పకుండా వినిపిస్తుంది. మీ సంపద పెరుగుతుంది. అప్పుల సమస్యలు తీరిపోనున్నాయి. అన్నీ అనుకూలించే సువర్ణాధ్యయం ఇది.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు పంచాంగాలు, గ్రహ గతులు ఆధారంగా ఇవ్వబడింది. ఇది ఆయా వ్యక్తులు పుట్టిన సందర్భాల్లో ఉన్న గ్రహల స్థితుల ఆధారంగా మారుతుంది. జీ న్యూస్ మీడియా ఈ వార్తను ధృవీకరించడం లేదు.