
జీర్ణక్రియ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ, జీవన ప్రక్రియలను సాఫీగా సాగించే ఒక సంక్లిష్టమైన, విశిష్టమైన వ్యవస్థ. తినే ఆహారం శక్తిగా మారడానికి శరీరంలోని వివిధ గ్రంథులు, ఎంజైమ్‌ల సమన్వయం ఎంతో కీలకం.
నోటిలోని లాలాజల గ్రంథుల నుంచి, శరీరంలో అతిపెద్ద గ్రంథి అయిన కాలేయం వరకు, ప్రతి అవయవం తనకంటూ ఒక ప్రత్యేక బాధ్యతను కలిగి ఉంటుంది. ఈ జీర్ణగ్రంథుల పనితీరు, అవి విడుదల చేసే స్రావాల ప్రాముఖ్యత, ఆహారంలోని క్లిష్టమైన పదార్థాలను సరళమైన పోషకాలుగా మార్చే విధానాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, ఆరోగ్యం పట్ల మరింత స్పష్టమైన అవగాహనను పెంపొందించుకోవచ్చు. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఈ అంశాలపై పోటీ పరీక్షార్థులు తగినంత పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. లాలాజల గ్రంథుల నుంచి కాలేయం, క్లోమం, జఠర గ్రంథుల వరకు అన్నీ కలిసి అద్భుతమైన జీవ రసాయనిక కర్మాగారం మాదిరి పనిచేసే తీరును తెలుసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.