
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ప్రముఖుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి.
స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం దక్కుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి.
చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు. ఇంటా బయటా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహారించాలి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
ఆదాయ మార్గాలు పెరిగి అప్పులు తీర్చగలుగుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.
కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహన యోగం ఉంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. బంధు మిత్రుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆశించిన ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా సమానంగా ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అదనపు పని భారం వల్ల తగిన విశ్రాంతి ఉండదు.
దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.