
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలకు చెందిన నాగేంద్ర(30) బెంగళూరులో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే నాగేంద్రతో వివాహానికి యువతి నిరాకరించింది.
కోపోద్రిక్తుడైన నాగేంద్ర.. శనివారం క్యాబ్ బుక్ చేసి, అందులో యువతిని ఎక్కించుకుని చిత్రదుర్గం వైపు బయల్దేరి వెళ్లాడు. ఆమెపై కత్తితో దాడి చేయగా.. కారు నుంచి దిగింది. ఈ క్రమంలోనే నాగేంద్ర తన వెంట తెచ్చుకున్న నాటు బాంబును పేల్చాడు. ఈ ఘటనలో నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్, యువతి ప్రాణాలతో బయటపడ్డారు. 👉మరిన్ని వివరాలు తాను తెచ్చుకున్న బాంబుకు.. తానే బలై.. |