
బాలీవుడ్లో ప్రతి ఏటా ఎందరో స్టార్లు తమ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తారు. కానీ 2026 మాత్రం హీరోయిన్ల నామ సంవత్సరం కానుంది.
ఈ ఏడాది రాబోయే నెలల్లో కొన్ని పవర్ఫుల్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద దుమారమే రేపుతాయని టాక్. వీటిలో యాక్షన్-థ్రిల్లర్, క్రైమ్, బయోపిక్ జానర్ సినిమాలు ఉన్నాయి. అయితే ఇందులో తెలుగు మూవీ కూడా ఉంది. నేషనల్ క్రష్ ఫిల్మ్ సైతం బాక్సాఫీసుని షేక్ చేసేందుకు వస్తోంది.
యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై 'ఆల్ఫా' సినిమా రూపొందుతుంది. ఇది జులై 3న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో ఆలియా భట్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఆమెతో పాటు శర్వరీ వాఘ్ కూడా కనిపించనుంది. శివ రవాయిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో బాబీ డియోల్, అనిల్ కపూర్, హృతిక్ రోషన్ కూడా కనిపించబోతున్నారు.
హుమా ఖురేషి నటిస్తున్న 'బేబీ డు డై డు' ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. ఇందులో హుమా ముంబైకి చెందిన ఒక హిట్వుమన్ పాత్రను పోషిస్తోంది. జులై 3న విడుదలవుతున్న ఈ చిత్రానికి నచికేత్ సమంత్ దర్శకుడు. ఇందులో సికందర్ ఖేర్, చంకీ పాండే కూడా నటిస్తున్నారు. దీనిపై మంచి అంచనాలున్నాయి.
శ్రద్ధా కపూర్ నటిస్తున్న 'ఈథా' సినిమా ఆగస్టు 28న విడుదల కానుంది. ఇది ప్రముఖ మహారాష్ట్ర తమాషా, లావణి కళాకారిణి విఠాబాయి భావు మాంగ్ నారాయణగావ్కర్ జీవితంపై ఆధారపడిన బయోపిక్. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
రష్మిక మందన్న నటిస్తున్న 'మైసా' ఒక యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో గురు సోమసుందరం, ఈశ్వరి రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల కానుంది. అణచివేతకు, ఆటుపోట్లకి, అవమానాలకు గురైన ఒక మహిళా తిరుగుబాటు నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని, ఇందులో తిరగబడ్డ మహిళగా రష్మిక మందన్నా కనిపిస్తుందని సమాచారం.