
కరోనా వచ్చి వెళ్లిపోయిన తర్వాత చాలామందిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తిండి, ఫిట్నెస్ చాలా అవగాహన పెంచుకుంటున్నారు.
Jun 27 2026 7:30 PM | Updated on Jun 27 2026 7:45 PM
కరోనా వచ్చి వెళ్లిపోయిన తర్వాత చాలామందిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తిండి, ఫిట్నెస్ చాలా అవగాహన పెంచుకుంటున్నారు. అందుకు తగ్గట్లే బరువు తగ్గుతూ సన్నగా మారిపోయి షాకిస్తున్నారు. ఇప్పుడు అలానే నటి ఖుష్బూ ఫ్యామిలీ కూడా మారిపోయింది. గతేడాది ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పటికీ ఇప్పుడు మరోసారి సదరు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: విజయ్.. నెలకు 20 రోజులు మాత్రమే)
ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీలో హీరోయిన్గా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఖుష్బూ తర్వాతి కాలంలో దర్శకుడు సుందర్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు అవంతిక, ఆనందిత అని ఇద్దరు కూతుళ్లు పుట్టారు. అయితే 2020 టైంలో వీళ్ల కుటుంబంలో అందరూ బొద్దుగా ఉండేవారు. దీంతో ఖుష్బూ కూతుళ్లపై ట్రోలింగ్ కూడా జరిగింది. తర్వాత కాలంలో బరువు తగ్గడంపై దృష్టి పెట్టి అంతా ఒకేసారి తగ్గిపోయి షాకిచ్చారు.
గతేడాది వినాయక చవితి సందర్భంగా ఖుష్బూ పోస్ట్ చేసిన ఫ్యామిలీ ఫొటోతో అందరూ షాకయ్యారు. ఇప్పుడు కూతురు అవంతిక పెళ్లి సందర్భంగా మరోసారి అప్పుడలా ఉండేవారు ఇప్పుడిలా మారిపోయారు అని చెప్పి సోషల్ మీడియాలో ఈ నటి ఫ్యామిలీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అవంతిక.. శ్రవణ్ శ్రీనివాస్‌ని పెళ్లి చేసుకుంది. గోవాలో జరిగిన ఈ వివాహానికి చిరంజీవి, నాగార్జున, త్రిష, తమన్నాతో పాటు చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ఘనంగా కూతురి పెళ్లి.. ఫొటోలు షేర్ చేసిన ఖుష్బూ)
నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)
భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
తెరపై నవ్వు.. తెర వెనుక విజన్.. భాగ్యరాజ్ అరుదైన (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)
తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)
వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్
సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు
సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..