
ఏపీలో తిరుపతి మినహా మిగిలిన విమానాశ్రయాల్లో బార్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన లైసెన్స్‌ల మంజూరుకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఒక విమానాశ్రయ బార్ లైసెన్స్ కింద గరిష్ఠంగా 3 సర్వింగ్ పాయింట్లకు అనుమతి ఇచ్చారు. వీటి వ్యాపార వేళలు 24 గంటలు ఉండేలా నిర్ణయించారు. బార్ లైసెన్స్‌ల నిర్వహణపై ఇప్పటికే మంత్రుల బృందం దిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసింది. AP: ఎయిర్‌పోర్టుల్లో బార్ల ఏర్పాటుకు నిర్ణయం |