
బూర్గంపహాడ్, జూన్ 27 : ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ప్రజలకు ఈ సర్వే ప్రక్రియ అందుబాటులో ఉండేలా అధికారు
లు చూడాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక సుందరయ్యనగర్‌లో జరిగిన సర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఓటర్లకు ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలు తమ ఓటరు వివరాలు పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ఎంతో కీలకమని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి అర్హుడి ఓటు హక్కు పరిరక్షణే ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, బీఎల్వేలు, నాయకులు భజన సతీష్, ప్రసాద్, ఇంగువ రమేష్, వారాల వేణు, పూలపెల్లి సుధాకర్‌రెడ్డి, ఎడమకంటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.