
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
No Coal Missing in Singareni: పెద్దపెల్లి జిల్లా సింగరేణి బొగ్గు గనులలో బొగ్గు మాయమైంది అంటూ వస్తున్న వార్తలను ఏఐటియుసి (AITUC) తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసమే.. కొన్ని రాజకీయ పార్టీలు సంస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడింది.. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన.. మీడియా సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
బొగ్గు మాయం కాలేదు.. టార్గెట్ కోసమే ఆ లెక్కలు.. సింగరేణిలో బొగ్గు మాయమైందని బిజెపితో పాటు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం పూర్తిగా బూటకమని ఏఐటియుసి నేతలు స్పష్టం చేశారు. అధికారులు అన్యువల్ టార్గెట్ చేరుకోవడం కోసం లెక్కల్లో అదనపు బొగ్గును కలిపి చూపించడం వాస్తవమేనని.. అయితే ఆ విధానం తప్పే కావచ్చు కానీ.. బొగ్గు మాయమైందని ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు.. గత బిఆర్ఎస్ హయాంలో బొగ్గు మాయమైందని ఆరోపించిన కాంగ్రెస్ నాయకుడే.. ఇప్పుడు BRS లో చేరి రాజకీయాల అద్దె కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు.. రాజకీయ పార్టీలు సింగరేణి పరిరక్షణతో పాటు కార్మికుల హక్కులను పక్కనపెట్టి బూటక మాటలు మాట్లాడుతూ సమస్త ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వాల వైఫల్యాలు.. పెరిగిన రాజకీయ జోక్యం.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోతోందని నేతలు ఆరోపించారు.. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహణను నిలిపివేసింది యాజమాన్యం కాదని.. రాష్ట్ర ప్రభుత్వమేనని వారు మండిపడ్డారు.. అదేవిధంగా, గత కెసిఆర్ ప్రభుత్వం మూలంగానే సింగరేణి బోర్డు పరిశ్రమ నాశనమైందని.. గత హయాంలోనే బొగ్గు గులాకులను అమ్ముకున్నారని విమర్శించారు. 2014 నుంచి సింగరేణికి చెందిన CSR, DMFT నిధులను ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం జూన్ 8న ప్రత్యేకమైన 31 డిమాండ్లతో యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చినట్లు నేతలు వెల్లడించారు. దీనిపై హైదరాబాద్ లోని రీజనల్ లేబర్ కమిషనర్ (RLC) వద్ద చర్చలు జరిగాయని.. జూలై 10 లోపు యూనియన్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆర్.ఎల్.సి యాజమాన్యానికి సూచించిందని తెలిపారు. ఒకవేళ యాజమాన్యం గనుక నిర్లక్ష్యం వహిస్తే.. అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఉమ్మడిగా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. 12వ వేజ్ బోర్డు సాధన.. కొత్త గనుల ఏర్పాటు కోసం ఏఐటియుసి ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.