
'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారంపై తన బలమైన ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు.
Jun 27 2026 2:05 PM | Updated on Jun 27 2026 2:36 PM
'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారంపై తన బలమైన ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. తాను బంగారం కొనుగోలు చేసిన మరుసటి రోజే ఔన్స్‌కు 62 డాలర్లు పెరిగిందని పేర్కొంటూ, ఇది కొత్త బుల్‌రన్‌కు సంకేతం కావచ్చని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో తెలిపారు. మార్కెట్ విశ్లేషకుడు జిమ్ రికార్డ్స్ అంచనాను ప్రస్తావిస్తూ, బంగారం ధర ఔన్స్‌కు 35,000 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని తాను కూడా నమ్ముతున్నట్లు వెల్లడించారు.
కియోసాకి ప్రకారం.. ఇన్వెస్టర్లు కేవలం వార్తలు లేదా భావోద్వేగాల ఆధారంగా కాకుండా టెక్నికల్ అనాలిసిస్ (TA) నేర్చుకోవడం అత్యంత అవసరం. మార్కెట్లు ఎప్పుడు ఎగుస్తాయి, ఎప్పుడు పడిపోతాయి అన్న సంకేతాలను చార్టుల ద్వారా అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటే, మార్కెట్ పెరిగినా, కుప్పకూలినా అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన సూచించారు. అయితే టెక్నికల్ అనాలిసిస్‌ను నేర్చుకోవడానికి తనకు ఎన్నో సంవత్సరాలు పట్టిందని కూడా చెప్పారు.
ఇటీవలే బంగారం ధరలు తగ్గుతున్న సమయంలో తాను వెంటనే కొనుగోళ్లు చేయబోనని, ముందు మార్కెట్లో బాటమ్ ఏర్పడిందని చార్టులు నిర్ధారించేవరకు వేచి చూస్తానని కియోసాకి పేర్కొన్నారు. ఇప్పుడు ఆ మలుపు వచ్చినట్లు కనిపిస్తోందని చెబుతూ మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించినట్లు వెల్లడించారు.
తెరపై నవ్వు.. తెర వెనుక విజన్.. భాగ్యరాజ్ అరుదైన (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)
తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)
నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)
ఆ రాళ్ళూ మాపై పడి ఉంటే... చంద్రబాబు, లోకేష్ లపై అంబటి ఫైర్
చిత్రహింసలు పెడుతూ రెండు రోజులు లాకప్ లో ...
రైతులు కాదు.. టీడీపీ రౌడీలు.. దాడి పై పేర్ని నాని రియాక్షన్
ఆపరేషన్ సిందూర్ వీరుడిగా మురళి నాయక్ కు గుర్తింపు
ఒకేసారి భారీగా పెరిగిన బంగారం తులం ఎంతంటే?