
పచ్చని ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్స్, కనుచూపుమేర కనిపించే సముద్రం, అలలు అలలుగా వచ్చే సముద్ర నీరు భూమిని తాకే అద్భుతమైన బీచ్ లు, చారిత్రక ప్రదేశాలు...
ఇవన్నీ ఒకేచోట ఉంటే ఆ ప్రాంతం భూలోక స్వర్గమే. ఇన్ని అందాలను తనలో దాచుకున్న ప్రాంతం మన విశాఖపట్నం... అందుకే ఈ నగరాన్ని, చుట్టపక్కల ప్రాంతాలను జీవితంలో ఒక్కసారైనా చూడాలని చాలామంది తెలుగోళ్లు కోరుకుంటారు.
ఏపీ ప్రజలే కాదు తెలంగాణోళ్లు కూడా స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి వైజాగ్ పర్యటనకు వెళుతుంటారు... మీరు కూడా ఇలా విశాఖపట్నం అందాలను వీక్షించాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసమే IRCTC ((ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ఆండ్ టూరిజం కార్పోరేషన్) బడ్జెట్ ధరలో ఓ టూర్ ప్యాకేజీ సిద్దం చేసింది. మూడు రోజులపాటు వైజాగ్ తో పాటు ప్రకృతి అందాలతో నిండిన అరకు, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం సింహాచలంను సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ''వైజాగ్ రీట్రీట్ (Vizag Retreat)'' పేరిట ఐఆర్సిటిసి ప్రకటించిన టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
IRCTC Vizag Retrest టూర్ ప్యాకేజీలో విశాఖపట్నంతో పాటు సింహాచలం ఆలయం, అరకు సందర్శన ఉంటుంది. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు బడ్జెట్ ధరలోనే వైజాగ్ టూర్ పూర్తిచేయవచ్చు. ఈ టూర్ మొత్తం రోడ్డుమార్గంలో సాగుతుంది... రైలు, విమాన ప్రయాణం ఉండదు కాబట్టి ప్యాకేజీ ధరలు తక్కువగా ఉన్నాయి.
ముగ్గురికి (ట్రిపుల్ ఆక్యుపెన్సి) - రూ.8060
ముగ్గురికి (ట్రిపుల్ ఆక్యుపెన్సి) - రూ.7680
విశాఖపట్నం-అరకు-సింహాచలం (2 రాత్రులు/ 3 రోజులు)
విశాఖపట్నం రైల్వే స్టేషన్ లేదా విమానాశ్రయం లేదా బస్టాండ్ నుండి టూర్ ప్రారంభం అవుతుంది. ముందుగా వైజాగ్ లో హోటల్ కి తీసుకెళతారు... ప్రెష్ అప్ అయ్యాక నగరంలో పర్యాటక ప్రాంతాల సందర్శన ఉంటుంది. తొట్లకొండలోని పురాతన బౌద్ద సముదాయాల సందర్శన ఉంటుంది. తర్వాత రుషికొండ బీచ్ లో సరదాగా గడిపే అవకాశం కల్పిస్తారు. బీచ్ ఒడ్డునే గల కైలాసగిరి హిల్స్ పైనుండి సముద్ర అందాలను, ప్రకృతి సోయగాన్ని వీక్షించవచ్చు. ఇలా సాయంత్రం వరకు విశాఖ పర్యటన ఉంటుంది... రాత్రి ఈ నగరంలోని హోటల్లోనే బస ఉంటుంది.
ఉదయం వైజాగ్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ అనంతరం రెండోరోజు పర్యటన ప్రారంభం అవుతుంది. హోటల్ నుండి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనంలో అరకు ప్రయాణం ఉంటుంది. మార్గమధ్యలో దట్టమైన అడవుల మధ్యలో ఏపీ టూరిజం వారి టైడా జంగిల్ బెల్స్ రిసార్ట్ సందర్శన ఉంటుంది. ఇక పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహల సందర్శన ఉంటుంది. రాత్రికి తిరిగి విశాఖపట్నం హోటల్ కి చేరుకుంటారు... డిన్నర్ ఇక్కడే ఉంటుంది.
మూడోరోజు ఉదయం వైజాగ్ హోటల్లో భోజనం అనంతరం సింహాచలం ఆలయానికి బయలుదేరాల్సి ఉంటుంది. నగరానికి 16 కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి రోడ్డు మార్గంలో ప్రయాణం ఉంటుంది. ఇక్కడ వరాహ లక్ష్మీనరసింహస్వామి (సింహాద్రి అప్పన్న) దర్శనం ఉంటుంది. అనంతరం సబ్ మెరైన్ మ్యూజియం, ఆర్కే బీచ్ సందర్శన ఉంటుంది. తిరిగి రైల్వే స్టేషన్ లేదా ఎయిర్ పోర్ట్ లేదా బస్టాండ్ లో దిగబెట్టడంతో విశాఖ పర్యటన ముగుస్తుంది.
ఐఆర్సిటిసి ప్యాకేజీలో కల్పించే సదుపాయాలు..