
భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల వేళ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల కార్యకలాపాలను మరికొన్ని వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల వేళ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల కార్యకలాపాలను మరికొన్ని వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి రాంచీ, ఇండోర్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్, ఓఖా నుంచి షకూర్ బస్తీకి నడిచే రైళ్లతో సహా మొత్తం 10 వేసవి ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారతీయ రైల్వే వెల్లడించింది.
వేసవి కాలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల సర్వీసులను నిజానికి జూన్ చివరి వారంతో నిలిపివేయాల్సి ఉంది. అయితే, ప్రయాణికుల సౌకర్యార్థం సర్వీసులను పొడిగించారు. తాజా ఆదేశాలతో ఆగస్టు మొదటి వారం వరకు ఈ రైళ్లు నడవనున్నాయి. రైళ్ల సమయాలు, ఆగే స్టేషన్లు యథాతథంగా కొనసాగుతాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
10 వేసవి ప్రత్యేక రైళ్ల పూర్తి షెడ్యూల్..
మరోవైపు ఆనంద్ విహార్–రాంచీ, ఇండోర్ మార్గాల్లో రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచారు. తాజా ఆదేశాల ప్రకారం రాంచీ-ఆనంద్ విహార్ టెర్మినల్ స్పెషల్ (02877) రైలు జులై 4 నుంచి జులై 25 వరకు ప్రతి శనివారం నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఆనంద్ విహార్-రాంచీ స్పెషల్ (02878) రైలు జులై 5 నుంచి జులై 26 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. ఇండోర్ జంక్షన్-హజ్రత్ నిజాముద్దీన్ సమ్మర్ స్పెషల్ ట్రైన్ (09309) జూన్ 28 నుంచి జులై 31 వరకు ప్రతి శుక్రవారం, ఆదివారం నడుస్తుంది. అలాగే హజ్రత్ నిజాముద్దీన్-ఇండోర్ జంక్షన్ స్పెషల్ రైలు (09310) జూన్ 29 నుంచి ఆగస్టు 1 వరకు ప్రతి శనివారం, సోమవారం నడుస్తుంది.
మరోవైపు ఈ రైళ్ల సమాచారానికి సంబంధించి అధికారులు హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 139కు ఫోన్ చేయాలని ప్రయాణికులను భారతీయ రైల్వే కోరింది. అలాగే తమ వెబ్సైట్ సందర్శించి షెడ్యూళ్లను తనిఖీ చేసుకోవచ్చని పేర్కొంది. బుకింగ్, ఇతర వివరాల కోసం రైల్ మదాద్ యాప్‌ను కూడా ఉపయోగించవచ్చని భారతీయ రైల్వే వెల్లడించింది.
చైనా రాజధాని బీజింగ్‌లో విమాన ప్రమాదం.. ముక్కలై కిందపడిపోయిన విమానం..
పాకిస్థాన్‌లో భూప్రకంపనలు.. పరుగులు తీసిన పాక్ ప్రజలు..