
జోతిష్యశాస్త్రం ప్రకారం రాహు,కేతు, శని గ్రహాల సంచారంలో మార్పుల కారణంగా రాబోయే రోజుల్లో అంటే ఈ ఏడాది చివర్లో కన్య రాశివారికి ఊహించని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో కన్య రాశిలో జన్మించినవారు
తొందరపడ నిర్ణయాలు తీసుకోకూడదు.అంతేకాదు.. ఎంత కష్టపడినా కూడా ఓటమి చూవి చూడాల్సి వస్తుంది. ఈ కాలంలో.. ఉద్యోగంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి.చిన్న పొరపాటు చేసినా కూడా అధికారుల ఆగ్రహానికి గురికావచ్చు. కాబట్టి.. ఏ పని చేసినా ఆచి తూచి వ్యవహరించాలి. వ్యాపారాల్లోనూ నష్టాలు రావచ్చు. డబ్బు విషయంలో ఎవరినీ తొందరపడి నమ్మకపోవడం మంచిది. ఈ సమస్యలు తగ్గడానికి శనివారం శని చాలీసా పఠించాలి.మృత్యుంజయ మంత్రం పఠించాలి.
రాహు, కేతు, శని గ్రహాల గోచారంలో మార్పుల కారణంగా మకర రాశివారికి కూడా ఊహించని కష్టాలు వస్తాయి. లక్ష్యం దారితప్పే అవకాశం ఉంది. కాబట్టి... లక్ష్యంపై దృష్టి మళ్లే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరు వేసే ప్రతి అడుగు ధైర్యంగా వేయాలి. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు వీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు చేసేవారు పనిచేసే చోట ఎవరితోనూ గొడవలు పడకూడదు. దాని వల్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్యలు తగ్గడానికి శనివారం శని చాలీసా పఠించాలి. మృత్యుంజయ మంత్రం పఠించాలి.
మీన రాశివారికి ఈ సమయంలో అనేక సవాళ్లు ఎదురౌతాయి. మొదలుపెట్టిన ప్రతి పనీ అసంపూర్తిగా మిగిలిపోయే అవకాశం ఉంది. రాత్రి పగలు కష్టపడి పని చేసినా కూడా ఏవో ఒక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. పనిపై ఏకాగ్రత తగ్గుతుంది. ఆర్థికంగానూ భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ నమ్మి.. డబ్బులు ఇవ్వకపోవడమే మంచిది. ఈ సమస్యలు తగ్గడానికి శనివారం శని చాలీసా పఠించాలి. మృత్యుంజయ మంత్రం పఠించాలి.