
ఆ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా సాగుతోంది. బంధు మిత్రులు ఎంతో కోలాహలంగా ఉన్నారు. కాసేపట్లో వరమాల కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. అలాంటి సమయంలో ఆ పెళ్లి వేడుకలో ఆనందం ఒక్కసారిగా విషాదంగా మారింది.
ఆ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా సాగుతోంది. బంధు మిత్రులు ఎంతో కోలాహలంగా ఉన్నారు. కాసేపట్లో వరమాల కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. అలాంటి సమయంలో ఆ పెళ్లి వేడుకలో ఆనందం ఒక్కసారిగా విషాదంగా మారింది. వరమాల కార్యక్రమానికి కొద్ది నిమిషాల ముందు వరుడు తీవ్ర కడుపునొప్పితో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బీహార్లోని చంపారన్ జిల్లాలో చోటుచేసుకుంది (Bihar Groom Death).
భర్వాలియా గ్రామానికి చెందిన 25 ఏళ్ల శక్తినాథ్ శర్మ తన వివాహ వేడుక కోసం తూర్పు చంపారన్ జిల్లా రామ్గఢ్వాకు చేరుకున్నాడు. కల్యాణ మండపానికి బంధుమిత్రులతో కలిసి ఊరేగింపుగా వెళ్లాడు. వరమాల కార్యక్రమం కోసం వేదిక ఎక్కిన వరుడు ఒక్కసారిగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడడం ప్రారంభించాడు. కాసేపటికే కుప్పకూలిపోయాడు (Wedding Tragedy).
కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు (Groom Dies Before Wedding). అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు ప్రకటించారు. మరణానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడికాలేదని, పూర్తి వైద్య నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు. వరుడి మరణ వార్త విని బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లి సందడితో కళకళలాడిన వేదిక కన్నీటి సంద్రంగా మారింది.
హైదరాబాద్లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. ధన్యవాదాలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు..
బంగారం ధరలు పెరిగాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..