
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Skoda Kodiaq RS: స్కోడా భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన వాహన శ్రేణిని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ తన కొత్త కోడియాక్ ఆర్ఎస్ ఎస్ యూవీని మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది. జూన్ 22 నుంచి కోడియాక్ ఆర్ఎస్ కోసం అధికారికంగా బుకింగ్స్ ను కూడా ప్రారంభించింది. అయితే లాంచ్ కు ముందే ఈ ఎస్ యూవీ భారీ సక్సెస్ సాధించింది. అన్ని యూనిట్లు కేవలం నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. స్కోడా ఈ ఎస్ యూవీని లిమిటెడ్ ఎడిషన్ గా అందిస్తోంది కంపెనీ. బుకింగ్స్ ప్రారంభించిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ ఎస్ యూవీ కోసం పోటెత్తారు.
మొత్తం 20 యూనిట్లు కేవలం 6 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. కోడియాక్ ఆర్ఎస్ బుకింగ్‌లను ప్రారంభించడానికి ముందు.. భారతదేశంలో కేవలం 50 యూనిట్లను మాత్రమే విక్రయిస్తామని కంపెనీ ప్రకటించింది. కంపెనీ తదుపరి బ్యాచ్‌ను భారతదేశానికి తీసుకువస్తుందో లేదో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ శక్తివంతమైన ఎస్యూవీ భారతదేశంలోకి పూర్తిగా నిర్మించిన యూనిట్‌గా దిగుమతి కానుంది. ఫలితంగా, దిగుమతి చేసుకున్న వాహనాలపై అధిక పన్ను భారం కారణంగా భారతదేశంలో దీని ధర ఎక్కువగా ఉంటుంది.
కోడియాక్ RS దాని రూపాన్ని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంచుకుంది. కానీ RS బ్యాడ్జింగ్, స్పోర్టీ హంగులను కలిగి ఉంది. ఇందులో గ్లాస్ బ్లాక్ గ్రిల్, మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లు, బ్లాక్-అవుట్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. ఎరుపు రంగు బ్రేక్ కాలిపర్లు, పెద్ద అల్లాయ్ వీల్స్ దీని దూకుడు రూపాన్ని మరింత పెంచుతాయి.
ఈ 7-సీటర్ SUVలో అనుసంధానించిన LED టెయిల్ ల్యాంప్‌లు, బ్యాక్ సైడ్‌లో స్పోర్టీ రూఫ్ స్పాయిలర్ ఉన్నాయి. క్యాబిన్ కూడా విశాలంగా ఉండి, ప్రయాణీకులందరికీ తగినంత స్థలాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. దీని క్యాబిన్లో స్పోర్ట్ సీట్లు, లెదర్, స్యూడ్ ఫినిషింగ్‌లు, ఎరుపు రంగు కుట్లు, RS బ్రాండింగ్ ఉన్నాయి. అంతేకాదు.. ఇందులో 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 13-స్పీకర్ల కాంటన్ ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఈ ఎస్‌యూవీకి 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 265 హెచ్‌పి, 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్, వోక్స్వ్యాగన్ గోల్ఫ్ జిటిఐలకు శక్తినిచ్చే ఇంజన్ కూడా ఇదే. దీనికి 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. ఇది నాలుగు చక్రాలకూ శక్తిని అందిస్తుంది.
భద్రత పరంగా చూస్తే.. ఈ ఎస్‌యూవీలో9 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, హిల్ అసిస్ట్, లెవెల్-2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.
8-లీటర్ల ఇంధన ట్యాంక్ కలిగిన ఈ మూడు వరుసల SUV, అన్ని సీట్లను మడిచినప్పుడు 281 లీటర్ల బూట్ స్పేస్‌ను, కేవలం మూడవ వరుసను మడిచినప్పుడు 786 లీటర్లను, రెండవ, మూడవ వరుసలను మడిచినప్పుడు ఏకంగా 1,976 లీటర్ల స్థలాన్ని అందిస్తుంది. తక్కువ సమయంలోనే పూర్తిగా అమ్ముడైపోవడం భారత మార్కెట్లో పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీలకు వేగంగా పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనమని చెప్పాలి. కోడియాక్ ఆర్ఎస్ ఈ విభాగంలో ఒక కొత్త సంచలనాన్ని సృష్టించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.