
సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు బాధితులకు అండగా నిలవాల్సిన ఒక మహిళా కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఒక వృద్ధుడి పట్ల ప్రదర్శించిన అమర్యాదకరమైన ప్రవర్తన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
రాజస్థాన్‌లోని దుంగార్పూర్ జిల్లాలో ఒక వృద్ధుడు తన సమస్యను చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్లో నిల్చొని ఎదురుచూస్తుండగా, అక్కడి మహిళా కానిస్టేబుల్ టేబుల్‌పై రెండు కాళ్లు చాపి దర్జాగా కూర్చున్న ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ప్రజల నుండి భారీ ఎత్తున నిరసన వ్యక్తమవడంతో ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.ఈ దారుణ ఉదంతం దుంగార్పూర్ జిల్లాలోని బిచ్చివార పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. ఒక నిరుపేద వృద్ధుడు తన ఫిర్యాదును నమోదు చేయించుకోవడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. అక్కడ విధుల్లో ఉన్న రీనా గార్గ్ అనే మహిళా కానిస్టేబుల్ ఆ వృద్ధుడి బాధను వినడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు సరి కదా, కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు. ఆమె తన కుర్చీలో కూర్చుని, ఎదురుగా ఉన్న ఆఫీస్ డెస్క్‌పై రెండు కాళ్లు పెట్టి ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించింది. ఆ సమయంలో సదరు వృద్ధుడు దీనంగా ఆమె వైపు చూస్తూ గంటల తరబడి కూర్చోవాల్సి వచ్చింది.పోలీస్ స్టేషన్లో ఉన్న ఎవరో ఈ నిర్వాకాన్ని తమ మొబైల్లో ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రం ఇంటర్నెట్లో ప్రత్యక్షమైన కాసేపటికే నెటిజన్లు సదరు లేడీ కానిస్టేబుల్ తీరుపై విరుచుకుపడ్డారు. ఒక సీనియర్ సిటిజన్ పట్ల ఇంత అమానవీయంగా, అగౌరవంగా ప్రవర్తిస్తారా? అంటూ ఆగ్రహం