
బ్రిటన్‌లోని బోల్టన్ క్రౌన్ కోర్టులో విచారణలో ఉన్న ఒక అత్యాచారం కేసులో నిందితుడు చెప్పిన సమాధానం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.
ఇద్దరు 14 ఏళ్ల బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫ్ఘన్ శరణార్థి.. కోర్టులో ఒక విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చాడు. తాను మద్యం తాగిన తర్వాత తనపై ‘సైతాన్’ ఆవహించిందని, అందుకే ఏం జరిగిందో తనకు గుర్తులేదని బుకాయించే ప్రయత్నం చేశాడు.ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన సుల్తానీ బకతాష్ (29) గత డిసెంబర్లో బోల్టన్‌లోని తన ఫ్లాట్‌కు ఇద్దరు బాలికలను తీసుకొచ్చాడు. వారికి బలవంతంగా వోడ్కా తాగించాడు. అనంతరం వారు పూర్తిగా మత్తులోకి జారుకుని స్పృహ తప్పే స్థితికి చేరుకున్నప్పుడు వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘోరానికి సంబంధించి అతడిపై రెండు రేప్ కేసులు, లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అయితే కోర్టులో తాను నిర్దోషినని బకతాష్ వాదిస్తున్నాడు.కోర్టు విచారణలో భాగంగా దుబాసి (అనువాదకుడు) సాయంతో నిందితుడు బకతాష్ తన సాక్ష్యాన్ని రికార్డు చేశాడు. ఆ రాత్రి మద్యం తాగిన తర్వాత తనకు విపరీతంగా తల తిరిగిందని, వాంతులు అయ్యాయని, ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదని చెప్పాడు. అంతేకాకుండా ఆ బాలికల వయసు 18 లేదా 19 ఏళ్లు ఉంటుందని తాను భావించినట్లు తెలిపాడు. ముస్లిం మతాచారాల ప్రకారం తాను సాధారణంగా మద్యం ముట్టనని చెబుతూ.. "ఆ రాత్రి నాపై సైతాన్ ఆవహించిందని అనుకుంటున్నాను. అందుకే ఆ బాటిల్ లోని మద్యం తాగాను, అది చాలా చేదుగా ఉంది" అని జ్యూరీ